Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan New Movie Team 2026: సినిమాల కోసం కొత్త టీం ని ఏర్పాటు...

Pawan Kalyan New Movie Team 2026: సినిమాల కోసం కొత్త టీం ని ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఇక పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే..

Pawan Kalyan New Movie Team 2026: రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటూ , మరో పక్క సినిమాలను కూడా సమాంతరంగా మ్యానేజ్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎంతటి వారైనా ఒత్తిడి తట్టుకోలేక రాజకీయాలను వదిలేయడం , లేదా సినిమాలను వదిలేయడం వంటివి గతం లో మనం చాలా సందర్భాలే చూశాము. కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాత్రం ఒక పక్క రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే, మరోపక్క సినిమాలను కూడా మ్యానేజ్ చేస్తూ , దేశంలో ఎవరికీ సాధ్యం అవ్వని అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఆయన నుండి విడుదలైన వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ చిత్రాలు కమర్షియల్ గా హిట్ అయ్యాయి. బ్రో మూవీ కాస్త యావరేజ్ గా ఆడింది. వీటికి టికెట్ రేట్స్ లేకపోవడం వల్ల , 100 కోట్ల షేర్ మార్కుని అందుకోలేకపోయాయి కానీ, లేదంటే ఈ మూడు సినిమాలు 100 కోట్ల షేర్ మార్కుని అందుకునేవి.

అయితే అధికారం లోకి వచ్చి, ఉప ముఖ్యమంత్రి పదవి ని చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో ఓజీ ఒక్కటే కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. మిగిలిన రెండు సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఈ రెండు సినిమాల్లోనూ సరైన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే లోపించాయి. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని చూస్తే, డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక నాలుగు సన్నివేశాలు రాసుకొని, దాని చుట్టూ కథ అల్లినట్టుగా అనిపించింది. అంటే బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే ఈ సినిమాని తీర్చి దిద్దారు. అందుకే అలాంటి డిజాస్టర్ ఫలితాన్ని చూడాల్సి వచ్చింది. ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఇది కచ్చితంగా తానూ ఏర్పాటు చేసుకున్న అవుట్ డేటెడ్ టీం లోపమే అని గమనించిన పవన్ కళ్యాణ్, ప్రక్షాళన అక్కడి నుండే మొదలు పెట్టాడు.

రీసెంట్ గా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కోసం ఒక ప్రత్యేకమైన టీం ని ఏర్పాటు చేసుకున్నాడట. ఇక నుండి ఏ డైరెక్టర్ అయినా స్క్రిప్ట్ ని వినిపించాలంటే ముందుగా ఈ టీం ని సంప్రదించాలట. వీళ్ళ నుండి ఆమోదం వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ వద్దకు స్క్రిప్ట్ చేరుతుంది. నేటి తరానికి చెందిన జెన్ జీ కుర్రాళ్లతో ఈ టీం ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇది నిజంగా శుభ పరిణామమే. పవన్ కళ్యాణ్ తన స్థాయికి తగ్గ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’ తో అందరూ చూసారు. ఇక మీదట కూడా అలాంటి సినిమాలే రాబోతున్నాయి. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండబోతున్నాయి అట. అంటే ఇక నుండి సినిమాల పరంగా ‘పవన్ కళ్యాణ్ 2.0’ ని చూడబోతున్నాం అన్నమాట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version