https://oktelugu.com/

Pawan Kalyan – Dasari Narayana Rao : పవన్ కళ్యాణ్ దాసరి నారాయణ రావుతో చేయాల్సిన సినిమా అదేనా..? చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేదిగా!

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన చనిపోయే ఏడాదికి ముందు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నాడు. స్వయంగా ఆయనే దాసరి వద్దకి వెళ్లి మీలాంటి లెజెండ్ ఇలా ఖాళీగా ఉండకూడదు అండీ, మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని అడిగాడని స్వయంగా దాసరి ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2023 / 10:57 PM IST
    Follow us on

    Pawan Kalyan – Dasari Narayana Rao : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకులలో ఒకరు దర్శకరత్న దాసరి నారాయణరావు. వందకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన ఎన్టీఆర్, ANR , కృష్ణ ,శోభన్ బాబు , చిరంజీవి , బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసాడు. ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు మరియు ఇండస్ట్రీ హిట్స్ కూడా అందించాడు. అయితే దాసరి నారాయణ రావు నేటి తరం స్టార్ హీరోలతో మాత్రం కలిసి పనిచెయ్యలేకపోయారు.

    ఆయన తోటి దర్శకుడు రాఘవేంద్ర రావు, నేటి తరం స్టార్ హీరోలైన మహేష్ బాబు – అల్లు అర్జున్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. కానీ దాసరికి అలాంటి అవకాశం రాలేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన చనిపోయే ఏడాదికి ముందు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నాడు. స్వయంగా ఆయనే దాసరి వద్దకి వెళ్లి మీలాంటి లెజెండ్ ఇలా ఖాళీగా ఉండకూడదు అండీ, మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని అడిగాడని స్వయంగా దాసరి ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.

    అయితే దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించకుండా నిర్మాతగా వ్యవహరించాలి అనుకున్నాడు. ఆయన సెట్ చెయ్యాలనుకున్న డైరెక్టర్ మరెవరో కాదు, దర్శక ధీరుడు రాజమౌళి. తనకి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసి పెట్టాల్సిందిగా కోరాడట.రాజమౌళి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇంతలోపే దాసరి గారు తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉంటే నిర్మాతగా దాసరి రేంజ్ ఏ స్థాయికి వెళ్లేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

    కాంబినేషన్ తో అవసరం లేకుండా ఓపెనింగ్స్ రప్పించే సత్తా ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ వరల్డ్ లెవెల్ లో తన పేరు ని ఒక బ్రాండ్ గా మార్చుకున్న దర్శకుడు రాజమౌళి. ఈ ఇద్దరి కలయిక లో ఒక సినిమా పడితే బాక్స్ ఆఫీస్ లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో చూద్దామని ట్రేడ్ పండితులు సైతం ఎదురు చూస్తున్నారు, అలాంటి కలయిక కి దాసరి నారాయణ రావు నిర్మాతగా వ్యవహరించి ఉండుంటే వేరే లెవెల్ ఉండేది.కానీ ఇప్పుడు మొత్తం తారుమారు అయ్యింది.