Pawan Kalyan Mahesh Babu Multistarrer: కెరియర్ స్టార్టింగ్ లో చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా ఏడు సినిమాలతో తన పవర్ ఏంటో చూపించాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కెరియర్ స్టార్టింగ్ లో ఒకటి అర సక్సెస్ లను సాధించిన కూడా ఆ తర్వాత ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు మంచి క్రేజ్ ఉండేది. వీళ్లిద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారని ఒక వార్త బయటకు వచ్చింది. దాంతో అటు మెగా అభిమానులు, ఇటు ఘట్టమనేని ఫ్యాన్స్ సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిజానికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. అలాంటి వాళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ధోరణిలోనే చాలామంది ఆలోచించారు.
Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!
కొంతమంది దర్శక నిర్మాతలు సైతం ఆ కాంబినేషన్ ని మల్టీ స్టారర్ సినిమాగా భారీ ఎత్తున తెరకెక్కించాలనే ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు… ఇక ఇప్పుడున్న చాలామంది పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులు ఆ సినిమా కనక వర్కౌట్ అయి ఉంటే దాని ముందు ‘త్రిబుల్ ఆర్’ సినిమా ఎందుకు పనికి వచ్చుండేది కాదు. వాళ్లిద్దరి క్రేజ్ ముందు ఎవరు నిలబడే వాళ్ళు కాదు.
అప్పట్లోనే మన తెలుగు సినిమా స్థాయి భారీ రేంజ్ లో విస్తరించేది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ వార్తలు వైరల్ అవుతుండడం విశేషం…
డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు…ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇద్దరు కలిసి ఇప్పుడు సినిమా చేసిన కూడా ఆ మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుంది అంటు పలువురు కామెంట్స్ చేస్తున్నారు…
