Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. సోషల్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా , ఇలా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించే చర్చ. ఈ స్థాయిలో ఒక ఆంధ్ర నాయకుడు చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరగడం గడిచిన 12 ఏళ్ళల్లో ఎప్పుడూ జరగలేదు. జనసేన పార్టీ ని తెలంగాణ లో యాక్టీవేట్ చేయడానికి తాజా రాజకీయ పరిణామాలు దోహదపడ్డాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి నుండి పవన్ కళ్యాణ్ సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తే మాత్రం ఆయనకు తెలంగాణ లో మంచి భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెద్ద సంచలనం గా మారింది. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాకుండా, బీఆర్ ఎస్ పార్టీ నాయకులూ కూడా స్పందించారు.
నేడు ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో , ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చాలా ఘాటుగానే స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారిని ఒక సినీ హీరో గా మేమంతా అభిమానిస్తాం , ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి గా ఆయనకు ఎంతో గౌరవం ఇస్తాం , మా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ కూడా పెట్టిస్తాను , కానీ మా రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోము, తెలంగాణ మా అయ్యా జాగీరా అని అంటున్నాడు , అవును , మా అయ్యా జాగీరే , తెలంగాణ రాష్ట్రము నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల అయ్యల జాగీరు, పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు , ఈమధ్యనే ఆయన ఓజీ సినిమా తీసాడు , మా తెలంగాణ రాజకీయాలకు ఓజీ కేసీఆర్, మరో ఓజీ అవసరం లేదు ‘ అంటూ ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారం రేపాయి.
దీనిపై పవన్ కళ్యాణ్ నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి అర్పిస్తూ , ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘కేటీఆర్ గారు ఏమి మాట్లాడాడో నాకు తెలియదు , ఇంకా నేను చూడలేదు , కానీ ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది , అన్నాదమ్ముల అనుబంధం మాది , కచ్చితంగా నా గురించి తప్పుగా అయితే మాట్లాడి ఉండదు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తెలంగాణ లో రాజకీయాలు నడిపేందుకు చూస్తున్నాడని అర్థం అవుతోంది.
