Pawan Kalyan And Anil Ravipudi: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నాడు? అనే దాని గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రతీ సంక్రాంతికి లాగానే వచ్చే సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి సినిమా ఉండబోతుంది అట. చాలా మంది విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ అనే సినిమాతో వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి సందడి చేయబోతున్నాడు అని అంటున్నారు. మరి కొంతమంది అయితే వెంకటేష్ తో కాదు, అక్కినేని నాగార్జున తో అనిల్ రావిపూడి ఈసారి పని చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నాడు, కాబట్టి ఆయనతోనే తన తదుపరి చిత్రం ఉండొచ్చు అని అంటున్నారు. అంతే కాదు, అనిల్ రావిపూడి కి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు, దిల్ రాజు తో చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు.
అనిల్ రావిపూడి ప్రధాన టార్గెట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడమే అట. చాలా కాలం క్రితమే పవన్ కళ్యాణ్ తో ఒక లెక్చరర్ కథ ని రాసుకున్నాడట అనిల్ రావిపూడి. ఇది పవన్ కళ్యాణ్ కోసం అలా సీల్ చేసి పెట్టాడట. దిల్ రాజు వద్ద పవన్ కళ్యాణ్ డేట్స్ ఉన్నాయి. ఈ కథతో ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట దిల్ రాజు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నాడట దిల్ రాజు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని సినిమా షూటింగ్స్ కోసం కేటాయించబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఆరంభం లోనే ఆయన సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయబోతున్నాడని అధికారిక ప్రకటన వచ్చింది.
పవన్ కళ్యాణ్ నేరుగా ఈ మూవీ షూటింగ్ లోనే దర్శనమిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా కంటే ముందు అనిల్ రావిపూడి మూవీ ని పట్టాలు ఎక్కించేలా దిల్ రాజు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ నుండి 65 రోజుల డేట్స్ కోరినట్టు సమాచారం. ఈ తక్కువ డేట్స్ లో అనుకున్న సినిమాని పూర్తి చేసి, సంక్రాంతికి రెడీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. మరి పవన్ కళ్యాణ్ ఆయన అడిగినన్ని డేట్స్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ ఇస్తే మాత్రం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన గ్రాండ్ గా జరగనుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే, పాన్ ఇండియన్ బిగ్ బడ్జెట్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ హైప్ క్రియేట్ అవుతుంది అనుకోవచ్చు. ఓజీ ని మించిన హైప్ ని మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు.