Ustaad Bhagat Singh Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితే చాలు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులంతా పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. ఆయన ఒక వ్యసనం అని కొందరు అంటుంటే, ఆయన మాకు దేవుడని అతని అభిమానులు చెబుతుంటారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా కోసం ఆయన అభిమానులు దాదాపు నెల రోజులుగా ఎదురు చూస్తుంటారు. ఆయనలా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఆ రేంజ్ కమర్షియల్ సినిమానైతే పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు. దాంతో మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈనెల 19వ తేదీన రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు… ట్రైలర్ మొత్తం ఒకెత్తహితే పవన్ కళ్యాణ్ అప్పిరియన్స్ మరొక ఎత్తుగా మారబోతుంది. ఆయన ఈ సినిమాలో ఎక్కువసేపు కనిపించబోతున్నాడు. గత సంవత్సరం వచ్చిన ‘ఓజీ’ సినిమాలో చాలా తక్కువ నిడివితో కనిపించి ప్రేక్షకులను కొంతవరకు నిరాశపరిచినప్పటికి ఈ సినిమాలో మాత్రం ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో మనకు కనిపించబోతున్నాడు…
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!
ఇక ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రైలర్లో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేస్తే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి డ్యాన్స్ రాదని అలాగే తనకు డాన్స్ అంటే ఇష్టం ఉండదనే విషయాన్ని సైతం ట్రైలర్ లోనే ఎలివేట్ చేశారు. అంటే ఈ డ్యాన్స్ కి సంబంధించిన కొన్ని సీన్లతో ముడిపడిన ఒక సీక్వెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
అందులో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ని ఇరగదిసి అరేయబోతున్నాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది…ఇక కథ కూడా పెద్ద కొత్తగా ఏమీ అనిపించడం లేదు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోనే సినిమా సాగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక విలన్ ఒక ఏరియాని తన అధీనంలో ఉంచుకొని ఒక నియంతలా దాన్ని కంట్రోల్ చేస్తుంటే అక్కడికి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఏం చేశాడు అనేదే ఈ సినిమా కోర్ పాయింట్ గా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకునే అతని అభిమానులకు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను అందిస్తుంది. తద్వారా పవన్ కళ్యాణ్ లోని పూర్తి మాసిజాన్ని ఈ సినిమాలో మనం మరోసారి చూడబోతున్నామా అనే డౌట్స్ ప్రతి ప్రేక్షకుడిలో కలుగుతున్నాయి. ఇక ట్రైలర్ ను చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో క్లియర్ కట్ విజన్ కనిపించింది. ఈనెల 19వ తేదీన రాబోతున్న ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…
