Papam Pratap Minus Points: ‘ చాలామంది యంగ్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. స్టార్ హీరోలు ఏ రేంజ్ లో సినిమాలను చేస్తున్నారో యంగ్ హీరోలు సైతం డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తిరువీర్ లాంటి నటుడు సైతం సోలో హీరోగా మారి వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. గత సంవత్సరం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ‘పాపం ప్రతాప్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అందరిని ఆకట్టుకున్నప్పటికి ఈ సినిమాలో ప్రధానంగా రెండు అయితే మైనస్ గా మారాయి…
అందులో ఒకటి ఈ సినిమాకి సాంగ్స్ అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఇక దానికి తోడుగా క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ప్రతాప్ కి ప్రాబ్లం ఉన్న విషయం మనకు తెలిసిందే. కానీ వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ అంత ఎఫెక్ట్ గా అనిపించలేదు.
కారణం ఏదైనా కూడా అదే సొల్యూషన్ ముందు కూడా చేయొచ్చు కదా చివరి దాకా ఆ సిచువేషన్ ను లాగడం దేనికి అనే ఒక ఫీలింగ్ అయితే సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. దానివల్ల ఈ సినిమా యావరేజ్ దగ్గరే ఆగింది. అది కనుక క్లారిటీగా ఉండుంటే సినిమా సూపర్ సక్సెస్ ని సాధించేది… ఇక తిరువీర్ సైతం సినిమా కోసం చాలా వరకు కష్టపడ్డాడు. ప్రతి సన్నివేశాన్ని ఎఫెక్టివ్ గా మలచడానికి ఆయన సహాయ శక్తుల ప్రయత్నం చేశాడు…
మొత్తానికైతే ఆయన పర్ఫామెన్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. కానీ దర్శకుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది… ఓవరాల్ గా ఒకే అనిపించినప్పటికి ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉండాల్సింది… ఇక తిరువీర్ సైతం చాలా మంచి సబ్జెక్ట్ లను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు…