https://oktelugu.com/

Nani’s ‘Dussehra’ : నాని ‘దసరా’ స్టోరీ ఇదే అయితే పాన్ ఇండియన్ రికార్డ్స్ మొత్తం బద్దలే!

Nani’s ‘Dussehra’ : విభిన్నమైన పాత్రలు మరియు కథలను ఎంచుకుంటూ న్యాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ని దక్కించుకున్నాడో మన అందరికీ తెలిసిందే.ఇతని ఫిల్మోగ్రఫీ మొత్తాన్ని చూస్తే యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ మరియు కుటుంబ కథా చిత్రాలే ఉంటాయి కానీ మాస్ సినిమాల సంఖ్య చాలా తక్కువ.అడపాదడపా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు.ఈసారి ఎలా అయినా భారీ సక్సెస్ కొట్టాలి అనే టార్గెట్ తో ‘దసరా’ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 18, 2023 / 10:48 PM IST
    Follow us on

    Nani’s ‘Dussehra’ : విభిన్నమైన పాత్రలు మరియు కథలను ఎంచుకుంటూ న్యాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ని దక్కించుకున్నాడో మన అందరికీ తెలిసిందే.ఇతని ఫిల్మోగ్రఫీ మొత్తాన్ని చూస్తే యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ మరియు కుటుంబ కథా చిత్రాలే ఉంటాయి కానీ మాస్ సినిమాల సంఖ్య చాలా తక్కువ.అడపాదడపా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు.ఈసారి ఎలా అయినా భారీ సక్సెస్ కొట్టాలి అనే టార్గెట్ తో ‘దసరా’ అనే చిత్రం ద్వారా మన ముందుకి రాబోతున్నాడు నాని.

    ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.రీసెంట్ గా విడుదల చేసిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.నాని ని ప్రేక్షకులు మరియు అభిమానులు ఇన్ని రోజులు ఎలాంటి రోల్ లో అయితే చూడాలనుకున్నారో అలాంటి రోల్ లో కనిపించడం తో పాటుగా, పాన్ ఇండియా స్కేల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

    రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా కి సంబంధించిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై వైరల్ గా మారింది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం ప్రముఖ నటి సిల్క్ స్మిత చుట్టూ తిరుగుతుందట.ఆమె పేరిట ఒక బార్ ఉంటుందట.సింగరేణి బొగ్గు కర్మాగారం లో రెండు గ్రూప్స్ గా విడిపోయి తరుచు గొడవ పడుతూ ఉండే రెండు బ్యాచులు ఆ బార్ కి వస్తూ, రోజు తాగేసి గొడవలు చేస్తూ ఉంటారట.ఆ బ్యాచ్ లో ఒకడిగా మనం నాని ని చూడవచ్చు.

    అలా సింగరేణి ప్రాంతం లో జరిగే గొడవలు, అక్కడి జనం పాటించే ఆచారాలు, పద్ధతులు వంటివి వెండితెర మీద అద్దం పట్టేలా డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడట.ఎంటర్టైన్మెంట్ మరియు ఊర మాస్ తో పాటుగా , సెంటిమెంట్ సన్నివేశాలు కూడా అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తుంది.ఇదే కనుక నిజమైతే కాంతారా రేంజ్ లో ‘దసరా’ కూడా ప్రతీ భాషలో సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.