https://oktelugu.com/

బుల్లితెరపై కొరటాల మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా?

దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40శాతం పూర్తయింది. చిరంజీవి ఇందులో డ్యూయల్ రోల్ చేస్తుండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. Also Read: పూజాకి ‘రాధే శ్యామ్’ స్వీట్ సర్‌ ప్రైజ్ ! ఈ మూవీ షూటింగు సమయంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ‘ఆచార్య’ సినిమా వాయిదా పడింది. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 / 01:42 PM IST
    Follow us on


    దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40శాతం పూర్తయింది. చిరంజీవి ఇందులో డ్యూయల్ రోల్ చేస్తుండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

    Also Read: పూజాకి ‘రాధే శ్యామ్’ స్వీట్ సర్‌ ప్రైజ్ !

    ఈ మూవీ షూటింగు సమయంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ‘ఆచార్య’ సినిమా వాయిదా పడింది. దీంతో చిత్రయూనిట్ ఇంటికే పరిమితమైంది. కరోనా సమయంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో కరోనాపై అవగాహన కల్పించడంతోపాటు తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇక దర్శకుడు కొరటాల శివ సైతం కరోనా సమయంలో ఓ కొత్త కథను సిద్ధం చేసుకున్నాడు.

    లాక్డౌన్ సమయంలోనే తాను రాసుకున్న కథను వెబ్ సిరీసు రూపంలో తీసుకొచ్చేందుకు కొరటాల ప్రయత్నం చేస్తున్నాడు. తన శిష్యుడితో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈమేరకు ఇప్పటికే అమేజాన్ ప్రైమ్ తో డీల్ ఇప్పటికే కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సీరిసులో నటించే నటీనటులు.. బడ్జెట్ తదితర విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

    Also Read: ఓటీటీల కొత్త రూల్స్.. బెనిఫిట్ ఎవరికీ?

    కొరటాల తెరకెక్కించే ఈ వెబ్ సీరిసులో కథానాయకుడిగా నవీన్ పొలిశెట్టిని ఎంచుకున్నట్లు టాక్ విన్పిస్తోంది. ఇటీవల నవీన్ పొలిశెట్టి నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

    తాజాగా కొరటాల శివ తెరకెక్కించే వెబ్ సిరీసులో నటించేందుకు నవీన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిగతా నటీనటుల ఎంపిక జరుగుతుందని సమాచారం. త్వరలోనే దీనిపై కొరటాల శివ అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నాడు.