Guntur Kaaram Old Sentiment : త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు, సెంటిమెంట్ కు కేరాఫ్ అడ్రస్.. ఇలా ఆయన పేరు చెబితే ఎన్నో గుర్తుకు వస్తాయి. ఇక ఏ ఇండస్ట్రీలో అయినా పేరు సంపాదించాలంటే ఎంతో కష్టపడుతుంటారు. అదే విధంగా ఈ స్టార్ డైరెక్టర్ కూడా చాలా కష్టపడి తమకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి అభిమానుల్లో..
ఇక ఈ సినిమా మీద ఒక వర్గం ప్రేక్షకుల్లో కాస్త నిరాశ ఉందట. త్రివిక్రమ్ సినిమాలు అంటే సెంటిమెంట్ కు కేరాఫ్ అడ్రస్ అంటుంటారు. ఈ డైరెక్టర్ ఎక్కువగా మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా సినిమాలనే తెరకెక్కిస్తారు. దీంతో ఈ రొటీన్ సినిమాలను చూడలేం అంటున్నారు కొందరు. అందుకే ఈ సినిమా మీద పెద్ద అంచనాలు కూడా లేవంటున్నారు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటే త్రివిక్రమ్ మాత్రం ఎందుకు ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగా అదే సెంటిమెంట్ ను ఎంచుకుంటారు అంటున్నారు కొందరు.
మళ్లీ ఫ్యామిలీ ఏమోషనల్ సెంటిమెంట్ సినిమాతో వస్తున్నాడా? మరి ఈ సెంటిమెంట్ తో ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలంటున్నారు కొందరు. కానీ ఈయన సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. ఈయన సినిమాలు నచ్చని వారికంటే మెచ్చే వారే ఎక్కువగా ఉంటారు. అంతేకాదు చిత్ర యూనిట్ కూడా ఈ సారి త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రానున్న గుంటూరు కారం సూపర్ హిట్ పక్కా అంటూ హామీ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. మరి చూడాలి ఈ సారి త్రివిక్రమ్ థియేటర్లలో ఎలాంటి మాయ చేయబోతున్నారో..