OG 2 Producer Change: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి ఘోరమైన ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు చేస్తాడా?, లేదంటే కేవలం పాలనపైన మాత్రమే ఫోకస్ పెడుతాడా అనే అనుమానాలకు చెక్ పడిన సంగతి తెలిసిందే. ఆయన తదుపరి చిత్రం తన కెరీర్ లో మైల్ స్టోన్ లాగా నిల్చిపోయిన ‘ఓజీ’ సీక్వెల్ ‘ఓజీ 2’ చేయబోతున్నాడని స్పష్టమైన క్లారిటీ అభిమానులకు ఇచ్చాడు. రీసెంట్ గానే ఈ చిత్ర డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ సినిమా షూటింగ్ ప్రణాళిక పై చర్చలు జరిపాడు. అందుకు సంబంధించిన ఫోటో ని విడుదల చేయగా , అది సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టించింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ , లక్షల కొద్దీ లైక్స్ ఈ ఫోటో కి వచ్చాయి. దీనికే ఈ రేంజ్ క్రేజ్ ఉంటే , ఇక ఫస్ట్ లుక్ రోజు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని అంటున్నారు నెటిజెన్స్.
సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా , ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేస్తారని , అదే నెలలో ముహూర్తపు కార్యక్రమాలు జరిపి , నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడతారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నుండి నిర్మాత DVV దానయ్య తప్పుకున్నాడని , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిమరించడానికి ముందుకొచ్చిందని , పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా నిర్మాణం లో భాగం కాబోతుందని , ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాకు పవన్ కళ్యాణ్ టీం కీలక సమాచారం అందించింది. ఈ సినిమా నిర్మాత గురించి సోషల్ మీడియా లో రకరకాల చర్చలు జరగడం మేము గమనిస్తూనే ఉన్నాము.
అవన్నీ నమ్మకండి , సరైన సమయం వచ్చినప్పుడు , అన్ని వివరాలను తెలియజేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో DVV ఇప్పటికీ ఉన్నాడా?, ఉంటే చాలా బాగుంటుంది అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే DVV సంస్థ ఆన్లైన్ లో ఈ సినిమా విడుదల సమయం లో ఇచ్చిన అప్డేట్స్ కి అభిమానులు మెంటలెక్కిపోయేవారు , అంతే కాకుండా ఆ హ్యాండిల్ కి విపరీతమైన రీచ్ కూడా ఉంది. అందుకే DVV కూడా భాగం అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి వాళ్ళు అవుతారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా మొదలు అవ్వలేదు. త్వరలోనే క్యాస్టింగ్ ని కూడా నిర్ణయిస్తారట.
