NTR Prashanth Neel Movie Update: ప్రస్తుతం నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్, సలార్ తో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లాంటి ఊర మాస్ హీరో తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే ఆత్రుత నందమూరి అభిమానుల్లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఉంది. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీం, మూడవ షెడ్యూల్ కోసం భారీ గ్యాప్ ని తీసుకోవాల్సి వచ్చింది. ప్రశాంత్ నీల్ కి ఇలా రెండు షెడ్యూల్స్ తీసిన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకునే అలవాటు ఉందట. ఈ చిత్రానికి కూడా అదే పద్దతిని అనుసరించాడని కొందరు అంటుంటే, మరికొంతమంది మాత్రం ఇప్పటి వరకు తీసిన ఔట్పుట్ పై ప్రశాంత్ నీల్ సంతృప్తి గా లేడని, అందుకే స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చి వేరే స్టైల్ లో మూవీ చేయబోతున్నాడని మరికొంతమంది అంటున్నారు.
ఇందులో ఏది నిజమో తెలియదు కానీ, ప్రశాంత్ మాత్రం తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్(Rukmini Vasanth) నటించబోతుందని మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ సినిమాలోని ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ కోసం బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అనిల్ కపూర్(Anil Kapoor) ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంప్రదించాడట. అనిల్ కపూర్ కూడా ఈ క్యారక్టర్ చేయడానికి సుముఖత చూపించినట్టు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం తో, అనిల్ కపూర్ ఈ వార్త కి సంబంధించిన ట్వీట్ ని క్వాట్ చేస్తూ ‘నేను చేయబోతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రాల్లో ఇదొకటి. మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
గత ఏడాది వీళ్లిద్దరు కలిసి ‘వార్ 2’ లో నటించారు. ఇందులో ఎన్టీఆర్ విలన్ క్యారెక్టర్ లో కనిపించగా, అనిల్ కపూర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించాడు. వీళ్లిద్దరి మధ్య ఈ చిత్రంలో రెండు మూడు సన్నివేశాలు కూడా ఉన్నాయి. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినట్టు చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది. ‘డ్రాగన్’ చిత్రం లో కూడా వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు పెద్ద హైలైట్ గా నిలుస్తుంది అట. ఈ ఏడాది లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అనుకున్నారు, కానీ ప్రశాంత్ నీల్ స్పీడ్ చూస్తుంటే వచ్చే ఏడాదికి కూడా ఈ సినిమా రెడీ అయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.