Adipurush Movie : ‘ఆదిపురుష్’ మూవీ పై చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఈమధ్య సోషల్ మీడియా లో ఈ చిత్రం గురించి ఎదో ఒక ఫేక్ న్యూస్ ప్రచారం అవుతూనే ఉంది. ఈ ఫేక్ న్యూస్ వెనకాల ఉన్నది ఎవరో తెలియదు కానీ, అభిమానులు మరియు మేకర్స్ మాత్రం చాలా తీవ్రమైన ఆగ్రహం తో ఉన్నారు, త్వరలోనే అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, చాలా కఠినతరమైన యాక్షన్ తీసుకుంటామని మేకర్స్ చెప్తున్నారు.
ఇంతకీ సోషల్ మీడియా లో ప్రచారమైన ఆ ఫేక్ న్యూస్ ఏమిటంటే, శ్రీరామ పారాయణం జరిగే చోట మన పరిసరాలు మొత్తం ఎంతో పవిత్రం గా ఉండాలని, కాబట్టి దళితులకు ఆదిపురుష్ మూవీ థియేటర్స్ లో చోటు లేదు అంటూ ఒక ప్రచారం సాగింది. దీనిపై ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ నెగటివిటీ ఏర్పడింది. ఆదిపురుష్ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటూ ట్రెండ్ కూడా చేసారు.
ఇదంతా గమనించిన మూవీ టీం వెంటనే తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందించింది. ఉదయం నుండి సోషల్ మీడియా ప్రచారం అవుతున్న ఈ సందేశం మా దృష్టికి వచ్చింది. ఇందులో ఎలాంటి నిజం లేదు, సినిమాకి సంబంధించి ఏ విషయమైనా మేమే అధికారికంగా ప్రకటిస్తాము, దయచేసి ఇలాంటి ఫేక్ రూమర్స్ ని నమ్మొద్దు. ఇలాంటి రూమర్స్ పుట్టించిన వారిని గుర్తించి త్వరలోనే చర్యలు తీసుకుంటాము అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది మూవీ టీం. దీంతో అందరూ కాస్త శాంతించారు.
యుగపురుషుడి జీవిత గాథని తెలియచేసే క్రమం లో మేము తెరకెక్కించిన ఈ వెండితెర దృశ్య కావ్యం ‘ఆదిపురుష్’ చిత్రం పై కావాలని ఎవరో కుట్రలు చేస్తున్నారు. అందరితో ఎంతో స్నేహంగా మెలిగే ప్రభాస్ సినిమాపై ఎవరికీ మాత్రం కక్ష ఉంటుంది?, ఇందులో కచ్చితంగా రాజకీయ కోణం ఎదో ఉందని తెలుస్తుంది అంటూ అభిమానులు సందేహిస్తున్నారు.