తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూతురు కవిత. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ క్యాండిడేట్‌పై ఓటమి పాలయ్యింది. తర్వాత ఏడాదిన్నర పాటు రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. ఆమె పేరు కూడా వినిపించలేదు. ఇటీవల నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఆమె ఎమ్మెల్సీగా గెలుపొందారు.
Also Read: చంద్రబాబు సైడ్.. చినబాబుకే స్టీరింగ్..
ఈ ఎన్నికలో అన్ని పార్టీలూ బరిలోకి దిగిన.. ఆ పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ విజయాన్ని అందరూ ఊహించిందే కూడా. అయితే.. కవిత గెలిచాక ఆమె కేబినెట్‌లోకి రాబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కవితను కూడా మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున గులాబీ నేతలు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ.. పార్టీలోని సీనియర్ లీడర్లు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ పదవికి కేవలం 15 నెలలు మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత మళ్లీ ఎన్నిక జరగుతుంది. ఇప్పుడు ఈ స్థాయిలో విజయం సాధించిన కవిత.. అప్పుడు కూడా విజయం సాధించే తీరుతారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు.
సరే.. ఇంతవరకు బాగానే ఉన్నా.. కవిత అలా గెలిచిందో లేదో వెంటనే కేబినెట్ బెర్త్ ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కవితను మంత్రివర్గంలోకి తీసుకోకుంటే కేసీఆర్ రాజ్యసభకు పంపేవారన్న వాదన కూడా ఉంది. ఒకానొక దశలో కవిత రాజ్యసభ నే కోరుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే దీనిని కొట్టిపారేస్తూ కవితను ఢిల్లీకి దూరం చేస్తూ తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే ఎమ్మెల్సీని చేసి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొందరు గట్టిగా పార్టీలోనే నమ్ముతున్నారు.
Also Read: బీహార్ ఎన్నికలు: కాంగ్రెస్ బలం ఎంత?
అయితే.. ప్రస్తుతం వినిపిస్తున్న మాటేంటంటే.. కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే కొందరిని తొలగించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఆ పనిచేయరట. మంత్రివర్గంలో 17 మందికే అవకాశముంది. ఇప్పటికే ఆ కోటా పూర్తి కావడంతో మరోసారి విస్తరణ జరిగితే తప్ప కవితకు ఇప్పట్లో మంత్రి అయ్యే ఛాన్స్ లేదంటున్నారు సీనియర్ నేతలు. కేసీఆర్ కూడా కవితను అంత త్వరగా మంత్రివర్గంలోకి తీసుకోరన్నది వినిపిస్తున్న మాట. అయితే.. ప్రస్తుతానికి మంత్రిపదవి ఇవ్వకపోయినా కేబినెట్ హోదా కలిగిన ఏదో ఒక పదవి ఇవ్వడం మాత్రం గ్యారంటీగా కనిపిస్తోంది. అంటే అధికారికంగా మంత్రి కాకున్నా.. మంత్రి హోదాలాంటి పదవి మాత్రం కవితకు దక్కనుందన్నమాట.