Venkatesh and Trivikram: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam) అనే చిత్రం చేస్తున్నాడు. 300 కోట్ల గ్రాస్ సినిమా తర్వాత, పెరిగిన తన మార్కెట్ రేంజ్ ని ఇంకా పెంచుకుంటూ వెళ్లాలని చూస్తున్నాడు వెంకటేష్, అందుకే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి చూస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా నాగవంశీ వ్యవహరిస్తున్నాడు. ‘గుంటూరు కారం’ తర్వాత కాస్త చిన్న బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ చిత్రం తో గ్రాండ్ గా కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ప్రముఖ యంగ్ హీరో నారా రోహిత్(Nara Rohit) ని ఒక కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నేడే ఆయన షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టినట్టు సమాచారం. నారా రోహిత్ ఒక సినిమాని అంత తేలికగా ఒప్పుకోడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఒకటి ఆయనకు కథ బాగా నచ్చాలి , అందులో తన పాత్రలో వైవిద్యం ఉండాలి. అప్పుడే ఆయన సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. అలాంటి నారా రోహిత్, ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడానికి ఒప్పుకున్నాడంటే కచ్చితంగా ఆయన పాత్ర చాలా బలమైనది అని తెలుస్తోంది. వెంకటేష్, నారా రోహిత్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంత అద్భుతంగా ఉంటే, సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. త్వరలోనే నారా రోహిత్ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టిన విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది.
ఇకపోతే గతం లో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలను అంత తేలికగా మర్చిపోగలమా?, మన జీవితాల్లో ఆ రెండు సినిమాలు ఒక భాగం అయిపోయాయి. బోర్ కొట్టినప్పుడల్లా వినోదం కోసం ఈ సినిమాలను యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాము. ఈ రెండు చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు , స్క్రీన్ ప్లే అందించగా, విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తొలిసారి త్రివిక్రమ్ వెంకటేష్ కి దర్శకత్వం వహించబోతున్నాడు. వాస్తవానికి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా 2018 లోనే రావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఇన్నేళ్లకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకొచ్చింది. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎంతమేరకు వర్కౌట్ అవుతుంది అనేది.
