https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Final : ఈరోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ

Bigg Boss 6 Telugu Final : బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి స్టార్ మా ఛానల్ లో అట్టహాసం గా జరగబోతోంది.. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా రేవంత్ , శ్రీహన్ , ఆది రెడ్డి, కీర్తి మరియు రోహిత్ నిలిచారు..వీరిలో టైటిల్ విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారు అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ లో పెట్టింది బిగ్ బాస్ టీం..ఇక గ్రాండ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2022 / 01:37 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Final : బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి స్టార్ మా ఛానల్ లో అట్టహాసం గా జరగబోతోంది.. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా రేవంత్ , శ్రీహన్ , ఆది రెడ్డి, కీర్తి మరియు రోహిత్ నిలిచారు..వీరిలో టైటిల్ విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారు అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ లో పెట్టింది బిగ్ బాస్ టీం..ఇక గ్రాండ్ ఫినాలే అంటే ప్రేక్షకులకు కన్నులపండుగ లాంటిది..టాప్ సెలబ్రిటీస్ తో కళకళలాడిపోతుంది.

    ఈరోజు కూడా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో త్వరలో థియేటర్స్ విడుదల అవ్వబోతున్న సినిమాల హీరోలు ప్రొమోషన్స్ లో భాగంగా పాల్గొన్నారు..ఈ నెల 23వ తారీఖున యంగ్ హీరో నిఖిల్ నటించిన ’18’ పేజెస్ తో పాటుగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా మూవీ కూడా విడుదల అవ్వబోతుంది..ఈ రెండు సినిమాల ప్రొమోషన్స్ కోసం నిఖిల్ మరియు రవితేజ ఈ గ్రాండ్ ఫినాలే కి విచ్చేసారు.

    హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ తో కాసేపు వీళ్ళు సరదాగా మాట్లాడిన కొన్ని మాటలు ప్రేక్షకులకు తిరుగులేని ఫన్ ఇవ్వబోతోంది.. వీరితో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా వచ్చాడట..ఇక ముఖ్య అతిథి గా ఎవరు రాబోతున్నారు అనేది చాలా కాలం నుండి సోషల్ మీడియా లో చర్చ జరుగుతూనే ఉంది..అక్కినేని నాగార్జున గతంలో 3 సీజన్స్ చేస్తే అందులో రెండు సీజన్స్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.. గత సీజన్ కి మాత్రం ముఖ్య అతిథి గా ఎవ్వరు హాజరు కాలేదు.. కానీ ఈ గ్రాండ్ ఫినాలే కి మాత్రం ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

    అంతేకాదు వచ్చే సీజన్ నుండి వ్యాఖ్యాతగా బాలయ్య బాబుని తీసుకునే ఆలోచనలో ఉందట బిగ్ బాస్ టీం.. అందుకే బాలకృష్ణ ని ఈ గ్రాండ్ ఫినాలే కి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే ఆయన వ్యాఖ్యాతగా ఆహా మీడియాలో చేసిన అన్ స్టాపబుల్ విత్ NBK రెండు సీజన్స్ గ్రాండ్ హిట్ అయ్యాయి..వ్యాఖ్యాతగా బాలయ్య బాబు భేష్ అనిపించాడు..మరి బిగ్ బాస్ వ్యాఖ్యాతగా కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటాడో లేదో చూడాలి.