Salaar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పవర్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ సినిమాతో మరొకసారి తన సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు. ప్రభాస్ కటౌట్ కి కరెక్ట్ సినిమా పడితే ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందో తెలియజేయడానికి ఈ ఒక్క సినిమా చాలు అంటూ పలువురు ప్రముఖులు సైతం కామెంట్లు చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నాలుగు రోజుల్లో 500 కోట్ల కలక్షన్స్ ని రాబట్టింది. అయితే ఈ సినిమా మీద ప్రశాంత్ నీల్ మొదటి నుంచే తన కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా మార బోతుంది అంటూ ఈ సినిమా మీద ఫస్ట్ నుంచే ప్రేక్షకులని సినిమా సక్సెస్ కోసం సిద్ధం చేస్తూ వస్తున్నాడు.తను చెప్పినట్టుగానే ప్రభాస్ కి ఒక అదిరిపోయే హిట్ కూడా ఇచ్చాడు.
ఇక సలార్ 2 సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాలని తొందరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ లెవెల్ లో ఈ సినిమాకి ఎలివేషన్స్ వర్కవుట్ అయినప్పటికీ ఈ సినిమాలో కేజీఎఫ్ తో పోలిస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నది కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. రవి బస్రుర్ ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ కేజీఎఫ్ లేవల్లో మాత్రం లేదని పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి కేజీఎఫ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర వహించింది. ఒక్కో సీన్ ఎలివేట్ అవ్వడానికి బ్యాగ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. కానీ ఈ సినిమాలో మాత్రం అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు అని రవి బస్రుర్ మీద ప్రభాస్ అభిమానులు కొంతవరకు సీరియస్ అవుతున్నారు. ఆయన కనక బిజిఎం భారీ లెవల్లో ఇచ్చుంటే మాత్రం సినిమా ఆల్మోస్ట్ బాహుబలి 2 రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి ఉండేదని మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం ఈ సినిమా మీద మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇంతకుముందు ఆయన హీరోగా వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇప్పుడు రాబోయే ఈ సినిమా మీదనే తన అంచనాలన్నీ పెట్టుకొని ఈ సినిమా సక్సెస్ కొడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి ప్రభాస్ కెరియర్ లో మరొక మంచి హిట్ గా నిలిచింది…