Homeఎంటర్టైన్మెంట్Mohan Babu The Paradise: 'ది ప్యారడైజ్' కోసం మోహన్ బాబు భారీ రెమ్యూనరేషన్.. నాని...

Mohan Babu The Paradise: ‘ది ప్యారడైజ్’ కోసం మోహన్ బాబు భారీ రెమ్యూనరేషన్.. నాని సినిమా బడ్జెట్ కంట్రోల్ తప్పుతోందా?

Mohan Babu The Paradise: ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని(Natural star Nani), శ్రీకాంత్ ఓదెల(Sirkanth Odela) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie). ఈ చిత్రం పై ట్రేడ్ లో స్టార్ హీరో సినిమాకు ఉన్నంత క్రేజ్ ఉంది. గ్లింప్స్ వీడియో నుండే ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ని కలిగించడం లో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఈ చిత్రం లోని క్యారెక్టర్స్ కి సంబంధించిన లుక్స్ మరింత ఆసక్తిని రేపింది. హీరో నాని లుక్, విలన్ గా నటిస్తున్న మోహన్ బాబు లుక్, చివరికి నాని స్నేహితుడిగా నటిస్తున్న సంపూర్ణేష్ బాబు లుక్, ఇలా అందరివీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేసాడు డైరెక్టర్. సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు , కానీ ఈ కాంబినేషన్ ఎదో కొత్త ప్రయత్నం చేస్తుంది అనే ఫీలింగ్ ని కలిగించింది.

ఇకపోతే ఈ సినిమాకు నాని కూడా ఒక నిర్మాత గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే . సుధాకర్ చెరుకూరి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ముందుగా అనుకున్నప్పుడు ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయిలు మాత్రమే. కానీ ఇప్పుడు అది 200 కోట్ల రూపాయలకు ఎగబాకింది. నాని కి టాలీవుడ్ లో అంత మార్కెట్ లేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన కెరీర్ హైయెస్ట్ గ్రాస్ 130 కోట్ల రూపాయిలు మాత్రమే. 200 కోట్ల బడ్జెట్ అంటే ఈ చిత్రం కచ్చితంగా వరల్డ్ వైడ్ గా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. అంటే టాలీవుడ్ మార్కెట్ మాత్రమే కాకుండా, బాలీవుడ్, కోలీవుడ్ మరియు ఇతర ప్రాంతీయ భాషకు సంబంధించిన మార్కెట్స్ కూడా కావాలి. అయితే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం తీసుకోవడం వల్లే బడ్జెట్ పెరిగిపోతూ వెళ్తుందని అంటున్నారు విశ్లేషకులు.

ఎక్కువగా రీ షూట్స్ చేయడం వల్ల సమయం, బడ్జెట్ రెండు వృధా అవుతున్నాయి. మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి అయ్యింది. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా, ఒక పక్కా ప్రణాళిక లేకుండా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమాని తెరకెక్కిస్తున్నాడని, రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని, నాని కాస్త అసహనానికి గురి అవుతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే సినిమాలో నటిస్తున్న నటీనటుల రెమ్యూనరేషన్స్ కూడా భారీగానే ఉన్నాయట. ఇందులో విలన్ గా నటిస్తున్న మోహన్ బాబు అక్షరాలా 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు టాక్. ఇది సాధారణమైన విషయం కాదు. ఇలా సినిమాకు సంబంధించి బడ్జెట్ విషయం ఏ ఒక్కటి కంట్రోల్ చేయలేకపోతున్నాడు శ్రీకాంత్ ఓదెల.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version