Manashankara Varaprasad Garu Premiere Show Talk: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Manashankara varaprasad garu) కాసేపట్లో ప్రీమియర్ షోస్ ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ టికెట్స్ మరియు మొదటి రోజు రెగ్యులర్ షోస్ టికెట్స్ భారీ రేంజ్ లో అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో మంచి గ్రాస్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు చేసుకుంది. పాజిటివ్ టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్. అది వస్తే ఈ సినిమా రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుందని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ప్రతీ సినిమాకు లాగానే, ఈ సినిమాకు కూడా విడుదలకు ముందు దుబాయ్ లో కొంతమంది ప్రముఖులకు స్పెషల్ షో వేయడం జరిగింది. వాళ్ళ నుండి ఈ సినిమాకు వస్తున్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటో వివరం గా చూద్దాం.
ప్రస్తుత తరం ప్రేక్షకులు ఇప్పుడు కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్నారు. పాత రొటీన్ కమర్షియల్ సినిమా టైపు లో తీస్తే తొక్కిపారేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘రాజా సాబ్ ‘ విషయం లో ఏమి జరిగిందో మనమంతా చూసాము. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా అలాంటి ఫలితం ఎక్కడ రిపీట్ అవుతుందో అనే భయం అటు మెగా అభిమానుల్లో ఉంది, ఇటు మూవీ టీం లో కూడా ఉంది. అయితే ట్రైలర్ లో చూపించినట్టుగానే, ఈ సినిమా ఒక ఫక్తు రొటీన్ కమర్షియల్ సినిమానే అట. ఫస్ట్ హాఫ్ మొత్తం వింటేజ్ చిరంజీవి కామెడీ టైమింగ్ తో లాగేసాడు కానీ, అనిల్ రావిపూడి స్టోరీ మీద పెద్దగా ద్రుష్టి పెట్టినట్టు అనిపించడం లేదని అంటున్నారు. అనిల్ రావిపూడి ప్రతీ సినిమాకు వచ్చే టాక్ ఇదే. ఆయన కోర్ ఆడియన్స్ ఫ్యామిలీ కాబట్టి వాళ్లకు ఈ ఫస్ట్ హాఫ్ కచ్చితంగా నచ్చుతుడని అంటున్నారు.
అదే విధంగా సెకండ్ హాఫ్ ఆరంభం లో కాస్త తగ్గినట్టు అనిపిస్తుందట కానీ, విక్టరీ వెంకటేష్ ఎంట్రీ తర్వాత సినిమా ట్రాక్ వేరే లెవెల్ కి వెళ్తుందని, ఓవరాల్ గా అనిల్ రావిపూడి మార్క్ సినిమా అని, ఎమోషన్స్ కూడా కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది కొద్దీ గంటల్లోనే తెలియనుంది. ఈ సినిమాకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో ఒకటి పాటలు. మొదటి పాటనే ‘హుక్ స్టెప్’ అట. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన ఈ పాటకు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. సినిమాలో కూడా ఈ పాట ఫుల్ వెర్షన్ వేరే లెవెల్ లో ఉంటుందట.