Mana Shankara Varaprasad Garu Overseas Collections : మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ లో మార్కెట్ సృష్టించింది మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). రెండు దశాబ్దాల క్రితమే ఆయన సినిమాలు ఓవర్సీస్ లో విడుదలై సంచలనాలను నమోదు చేశాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి వారు ఆ ఓవర్సీస్ మార్కెట్ ని తార స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఈమధ్య కాలం లో చిరంజీవి సినిమాలకు ఓవర్సీస్ లో కాస్త క్రేజ్ తగ్గింది. ఆయన రేంజ్ కి తగ్గ కలెక్షన్స్ ని రాబట్టలేకపోయాడు. కానీ రీ ఎంట్రీ లో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం తో చిరంజీవి USA లో 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ని మరోసారి మెగాస్టార్ అందుకోలేకపోయాడు. అయితే ఈ నెల 12 న విడుదల కాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu)చిత్రం తో ‘ఖైదీ నెంబర్ 150’ రికార్డుని అందుకోబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
అంతే కాదు, ఈ చిత్రం రీసెంట్ గా విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ ప్రీమియర్స్ గ్రాస్ ని కూడా దాటేయబోతుంది. ‘రాజా సాబ్’ చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా దాదాపుగా 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ రికార్డు ని ‘మన శంకర వరప్రసాద్ గారు’ దాటేయబోతుంది. ఈ చిత్రానికి USA ప్రీ సేల్స్ ద్వారా దాదాపుగా $850K డాలర్లు వచ్చాయి. ఓవరాల్ నార్త్ అమెరికా కలిపి ఈ చిత్రానికి $920k డాలర్లు వచ్చాయి. ప్రీమియర్స్ మొదలయ్యాక పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న తర్వాత ఈ చిత్రానికి 1.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే ‘రాజా సాబ్’ కంటే ఎక్కువ గ్రాస్ చేసినట్టు.
కేవలం నార్త్ అమెరికా లో మాత్రమే కాదు, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, మిడిల్ ఈస్ట్ లో కూడా ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగుతుంది. చూస్తుంటే కేవలం ఓవర్సీస్ నుండే మెగాస్టార్ 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉన్నాడు. సైరా నరసింహా రెడ్డి చిత్రం తర్వాత మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ నుండి సరైన ఓపెనింగ్స్ చూడలేకపోయారు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తో మరోసారి తన ఓపెనింగ్స్ స్టామినా ని చూపించబోతున్నాడు మెగాస్టార్. చూడాలి మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ రాబోతుంది అనేది. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 60 నుండి 70 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.