Mana Shankara Varaprasad Garu OTT: ప్రస్తుతం సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న రికార్డ్స్ ని చూసి ట్రేడ్ మొత్తం నివ్వెరబోతోంది. గత సంక్రాంతికి అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం కేవలం మొదటి వారం లోనే 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని ఆ చిత్ర నిర్మాతలు అంటున్నారు. కానీ ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటి వారం 220 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి సోషల్ మీడియా లో ఆసక్తికరమైన వార్త ప్రచారం లోకి వచ్చింది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ ప్రైజ్ కి జీ5 సంస్థ కొనుగోలు చేసింది. గతంలో అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కూడా జీ5 సంస్థనే కొనుగోలు చేసింది. థియేటర్స్ లో ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో, ఓటీటీ లో కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సుమారుగా ఆరు నెలల పాటు ఈ చిత్రం టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది. అందుకే ఈ చిత్రాన్ని కూడా మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి కొనుగోలు చేశారట. ఇదంతా పక్కన పెడితే ఈ సంస్థతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత జీ5 లో విడుదల చేసుకోవచ్చు అట.
అంటే సరిగ్గా ఫిబ్రవరి 10 లేదా 11 తేదీలలో ఈ చిత్రం జీ5 యాప్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకో లాగా కూడా జరగొచ్చు. గతంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఒకేసారి టీవీ టెలికాస్ట్ మరియు ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. ఇది మర్చి నెలలో జరిగింది. ఒకవేళ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని కూడా అలాగే విడుదల చేస్తారేమో?, కలెక్షన్స్ స్టడీ గా ఉంటే మార్చి నెలలో, ఒకవేళ తగ్గితే ఫిబ్రవరి లోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి . దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభ ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారట మేకర్స్. ఈ ఈవెంట్ కి చిరంజీవి సోదరుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా విచ్చేసే అవకాశాలు ఉన్నాయి.