Mana Shankara Varaprasad Garu: ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara varaprasad garu movie) చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ సంక్రాంతి విజేతగా నిలిచింది. 6 రోజుల్లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ టార్గెట్ ని అందుకోవడానికి పరుగులు తీస్తోంది. 300 కోట్ల దగ్గరే సినిమా ఆగిపోయే అవకాశం అసలు కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం కచ్చితంగా 400 కోట్ల గ్రాస్ మార్కుని కూడా ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . అంటే కలెక్షన్స్ పరంగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ ‘, ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రాలను ఈ సినిమా దాటేయబోతుంది అన్నమాట. కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు, బుక్ మై షో టికెట్ సేల్స్ పరంగా కూడా ఈ చిత్రం 6 రోజుల్లోనే ఓజీ టికెట్ సేల్స్ ని దాటేసింది.
ఓజీ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా గత ఏడాది 2.78 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి కేవలం 6 రోజుల్లోనే 2.81 మిలియన్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. విడుదల రోజు నుండి నిన్నటి వరకు ఈ చిత్రానికి రోజుకు నాలుగు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోతుండేవి. అందుకు ఇంత తక్కువ సమయం లో ఈ రేంజ్ టికెట్ సేల్స్ జరిగాయి. అతి త్వరలోనే ఈ చిత్రం ‘దేవర’ బుక్ మై షో టికెట్స్ సేల్స్ ఫైనల్ కౌంట్ ని రాబోయే రోజుల్లో దాటేస్తుందని అంటున్నారు. ఒక సాధారణ ప్రాంతీయ బాషా చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు, ఈ స్థాయి టికెట్ సేల్స్ జరగడం అనేది కేవలం మెగాస్టార్ కి మాత్రమే సాధమైందంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పోటీ లో 5 సినిమాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం ఈ రేంజ్ టికెట్ సేల్స్ ని దక్కించుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఈరోజు కూడా ఈ చిత్రానికి గంటకు 15 వేల టిక్కెట్లు బుక్ మై షో యాప్ ద్వారా అమ్ముడుపోతున్నాయి. నిన్న అయితే ఏకంగా గంటకు 20 వేలకు పైగా టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి. ఇదే రేంజ్ జోరు కొనసాగిస్తూ ముందుకు వెళ్తే మాత్రం ఈ చిత్రం 4 మిలియన్ టికెట్ సేల్స్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ వృద్ధిలోకి వచ్చిన తర్వాత, అత్యధిక థియేటర్స్ అటు వైపే వెళ్లిపోయాయి. అయినప్పటికీ బుక్ మై షో లో ఈ రేంజ్ ట్రెండ్ చూపించడం అనేది నిజంగా మెగాస్టార్ ఊర మాస్ అనే చెప్పాలి.
