Mana Shankara Varaprasad Garu: తెలుగులో టాప్ హీరోగా వెలుగొందుతున్న నటుడు చిరంజీవి…గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈనెల 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ మేరకు కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది అనేది ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఇయర్లో దక్కిన మొదటి సక్సెస్ గా ఈ సినిమాను ఒక రికార్డు ను తన ఖాతాలో వేసుకుంది…ఈ ఇయర్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక గత సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. కానీ ఇప్పుడు మెగాస్టార్ తో చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాబట్టి ఈ సినిమా అంతకుమించిన సక్సెస్ ని సాధించి 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకి 200 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు…ఇక ఈ సినిమా మరో 200 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమాతో ఏదో ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన చేసిన సినిమాలు అతనికి చాలా మంచి గుర్తింపునైతే తీసుకొస్తాయి. అందుకే అతను చాలావరకు కామెడీ జానర్ లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు.
తన మార్క్ ను పోగొట్టుకోకుండా ఏ హీరో వచ్చినా కూడా ఆ హీరో మేనరిజమ్స్ తో అతని ఫ్యాన్స్ ను అలరిస్తూనే తన మార్క్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని చూపిస్తూ కామెడీని కూడా టచ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు… ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఖాతాలో మరో సక్సెస్ అయితే వచ్చింది.
ఇప్పటికే వరుసగా 8 విజయాలతో మంచి ఊపు మీదున్న ఆయనకు మన శంకర వరప్రసాద్ సినిమా తొమ్మిదో విజయాన్ని అందించి త్రిబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ గా పేరును సంపాదించి పెట్టింది. ఇక రాజమౌళి తర్వాత వరుస విజయాలను సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి నే కావడం విశేషం…