Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Vara Prasad Garu: 3వ వారంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 10...

Mana Shankara Vara Prasad Garu: 3వ వారంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 10 మూవీస్ ఇవే..’మన శంకర వరప్రసాద్ గారు’ ఏ స్తానంలో ఉందంటే!

Mana Shankara Vara Prasad Garu: మన టాలీవుడ్ లో మొదటి వీకెండ్ దాటి, మూడవ వీకెండ్, నాల్గవ వీకెండ్ కూడా భారీ గా వసూళ్లను రాబట్టే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ రేంజ్ లాంగ్ థియేట్రికల్ రన్ ఉండాలంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు ఉండాలి. అలా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ తో, మూడవ వారంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 10 సినిమాల లిస్ట్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందరూ ఊహించినట్టు గానే ఈ జాబితాలో కూడా ‘బాహుబలి 2’ నే నుంబర్ 1 స్థానం లో ఉంది. మూడవ వారం ఈ చిత్రానికి దాదాపుగా 18.20 కోట్ల రూపాయిలు వచ్చాయట. ఇప్పటి వరకు ఈ రికార్డుని ఎవ్వరూ ముట్టుకోలేకపోయారు. ఇక రెండవ స్థానం లో ఎవ్వరూ ఊహించని విధంగా ‘హనుమాన్’ చిత్రం 16 కోట్ల రూపాయిల షేర్ తో కొనసాగుతోంది.

ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం 14.19 కోట్ల రూపాయలతో కొనసాగగా, నాల్గవ స్థానం లో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం 12.92 కోట్ల రూపాయలతో కొనసాగుతోంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే #RRR చిత్రం మూడవ వారం లో ‘దేవర’ కంటే తక్కువ వసూళ్లను రాబట్టడమే. ఆ చిత్రానికి కేవలం 12.31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చి టాప్ 5 స్థానం లో కొనసాగుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఆ తర్వాత ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రం 10.58 కోట్ల రూపాయలతో ఆరవ స్థానంలో కొనసాగుతుండగా, ‘బాహుబలి’ చిత్రం 10.50 కోట్ల షేర్ తో 7వ స్థానంలో, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 9.63 కోట్ల రూపాయలతో 8వ స్థానంలో , ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం 9.59 కోట్ల రూపాయలతో 9 వ స్థానం లో కొనసాగుతున్నాయి.

ఇక 10 వ స్థానం లో గత సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 9.53 కోట్ల రూపాయలతో కొనసాగుతోంది. ఇది టాప్ 10 లిస్ట్. రీసెంట్ గా విడుదలై ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి టాప్ 10 లో స్థానం దక్కలేదు. ఆ చిత్రానికి మూడవ వారం లో 8.46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అప్పుడెప్పుడో 13 ఏళ్ళ క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం 8.55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దానికంటే తక్కువ షేర్ వసూళ్లు ‘శంకర వరప్రసాద్ ‘ కి నమోదు అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version