మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ కాంబినేషన్లలో తొలిసారి మూవీ తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది దసరాకు ప్రారంభమైన మూవీ వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే కొన్నిరోజులు హైదరాబాద్లో ‘ఆచార్య’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ డైనమిక్ ఎండోన్మెంట్ ఆఫీసర్ గా చిరు కనించనున్నాడు. చిరుకు జోడీగా వెటరన్ బ్యూటీ త్రిష నటిస్తుంది.
చిరు-152లో మూవీలో రాంచరణ్ ప్లాష్ బ్యాక్ కథాంశంలో నటిస్తాడనే ప్రచారం జరిగింది. అయితే రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉండటంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో రాంచరణ్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తాడని ప్రచారం జరిగింది. రాంచరణ్ కోసం నక్సలైట్ పాత్రను సిద్ధం చేసిన కొరటాల శివ మహేష్ కోసం ఆ పాత్రలో కొన్ని మార్పులు చేశాడు. మహేష్ ను స్టూడెంట్ లీడర్ గా చూపించేందుకు కథను సిద్ధం చేశాడు. తాజా సమాచారం మేరకు మహేష్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
మహేష్ ‘ఆచార్య’ కోసం నెలరోజుల కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే 30రోజులకు మహేశ్ రూ.30కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశాడని కూడా వార్తలు వినిపించాయి. చిత్రబృందం ముందు ఓకే అనుకున్నప్పటికీ అంత భారీ రెమ్యునరేషన్ వల్ల బడ్జెట్ పరిమితులు దాటుతుండటంతో పునరాలోచనలో పడ్డారు. దీంతో చరణ్‌తోనే ఈ పాత్రను చేయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాంచరణ్ పాత్ర కోసం బన్నీ కూడా పోటీ పడుతున్నాడు. చిరు సినిమాలో నటించే ఛాన్స్ ఈ ముగ్గురిలో ఎవరి వరిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.