మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుస మూవీలతో బీజీగా మారారు. చిరంజీవి ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టడంతో దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ‘ఖైదీ-150’ మూవీతో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనిపించుకున్నారు మెగాస్టార్. ఆ తర్వాత చిరు డ్రిమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ను తెరకెక్కించి అభిమానులను అలరించారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత చిరంజీవి దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లలో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
మెగాస్టార్‌తో ఫుల్ లెంత్ కామెడీని చేయించేందుకు త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడు. ఈమేరకు త్రివిక్రమ్ మంచి కథను సిద్ధం చేశారు. దీనిని చిరంజీవి విన్పించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ మూవీలో చిరు అభిమానులను కడుపుబ్బా నవ్విస్తారని త్రివిక్రమ్ అంటున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
చిరంజీవి గతంలో నటించిన ‘చంటబ్బాయ్’ మూవీ ఫుల్ లెన్త్ కామెడీతో అభిమానులను అలరిస్తుంది. ఇప్పటికీ ఆ మూవీలో చిరు నటన చూస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. అలాగే ‘అందరీవాడు’ మూవీలో చిరంజీవి కామెడీ ఓ రేంజ్లో ఉంటుంది. చిరు నటనలో యాక్షన్, డాన్స్ తోపాటు కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది. చిరు కామెడీ చేస్తే ఏ స్టార్ కామెడియన్ కూడా పనికి రాడన్నట్లు ఉంటుంది ఆయన టైమింగ్. అదేవిధంగా మాటల మాంత్రికుడు మూవీల్లో కామెడీకి ప్రత్యేక ట్రాక్ ఉంటుంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఫుల్ లెన్త్ కామెడీ వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.