Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu : మహేష్ బాబు బర్త్ డే కి రాజమౌళి ఇచ్చే సర్ ప్రైజ్...

Mahesh Babu : మహేష్ బాబు బర్త్ డే కి రాజమౌళి ఇచ్చే సర్ ప్రైజ్…

Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు మహేష్ బాబు… ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతకుముందు వరకు ఆయన కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేసేవాడు. కానీ మొదటిసారి పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో శరవేగంగా పాల్గొంటున్నారు.

నెక్స్ట్ మంత్ మహేష్ బాబు బర్త్ డే ఉన్న సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక టీజర్ కూడా మామూలు రేంజ్ లో ఉండదట. రాజమౌళి దానికోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటినుంచి టీజర్ కి సంబంధించిన పనులను స్టార్ట్ చేశారట.

ఆయన బర్త్ డే కి మరో నెల రోజుల సమయం కూడా లేదు కాబట్టి మహేష్ బాబు అభిమానులు సైతం స్టన్ అయ్యే విధంగా ఈ టీజర్ ఉండబోతుందట. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబును టాప్ రేంజ్ లో చూపించడానికి రాజమౌళి ఫిక్స్ అయ్యాడనే విషయం మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారట.

ఆయన ఒక్కో పాత్రలో ఎలాంటి హవా భావాలను పలికిస్తాడనేది ప్రేక్షకులందరికి తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినప్పటికి టైర్ వన్ హీరోలు చేస్తున్న మూవీస్ కి భారీ గుర్తింపు వస్తుంది. అందుకనే వాళ్లు ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు.మహేష్ బాబు సైతం ప్రస్తుతం అదే బాటలో నడుస్తుండడం విశేషం…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version