Lokesh Kanagaraj- Prashanth Neel: మొనాటానీ వచ్చిన తర్వాత బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. దీనిని వ్యాపారులు ట్రెండ్ అని, సినిమా వాళ్లు జనరేషన్ అని, మేధావులు తరం అని, సామాన్యులు మార్పు అని అంటారు. ఎవరి తర్కనికి ఆచించవచ్చును గాని.. ఈ అన్నింటిని ముందుకు తీసుకు వెళ్లే వాళ్ళని మాత్రం ఐకానిక్ పర్సన్స్ అంటారు. ఆ ఐకానిక్ పర్సన్స్ కి లోకం ఎప్పుడూ దాసోహమనే అంటుంది. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమ ఎర్ర తివాచీ పరుస్తుంది. కన్నడ, తమిళ రంగాలకు చెందిన ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులకే మార్కెట్లో భారీగా డిమాండ్ ఉన్నది. ఆ ఇద్దరికీ మహా అయితే మూడు, నాలుగు సినిమాల కంటే ఎక్కువ బ్యాగ్రౌండ్ లేదు. కానీ వాళ్లు చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు? వాళ్ల సినిమాలు ఎందుకు ప్రత్యేకం? తమ కథల ద్వారా ప్రత్యేక యూనివర్స్ క్రియేట్ చేసుకున్న వారు ప్రేక్షకులను ఎలా లీనం చేసుకోగలుగుతున్నారు? ఇన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం ఈ కథనం.
కథ చెప్పడంలో వీరు స్టైలే వేరు
టాలీవుడ్, బాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఉడ్ తీసుకున్నా సినిమా కథలన్నీ కూడా అనగనగా… అనే ప్రశ్నతోనే మొదలవుతాయి. కానీ లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ కథలన్నీ భిన్నంగా మొదలవుతాయి. ఒక డార్క్ సింపోజియాన్ని ఇప్పుడున్న నేటివిటికి మలుస్తారు. అక్కడి నుంచి బలమైన పాత్రలను పరిచయం చేకథలన్నీ భిన్నంగా మొదలవుతాయి. ఒక డార్క్ సింపోజియాన్ని ఇప్పుడున్న నేటివిటికి మలుస్తారు. అక్కడి నుంచి బలమైన పాత్రలను పరిచయం చేసుకుంటూ పోతారు. ఒక పాత్రకు మరో పాత్రకు కనెక్టివిటీని పెంచుతూనే కథను బిల్ట్ చేస్తారు. సేమ్ హాలీవుడ్ థీసిస్ ఇక్కడ ఫాలో అవుతారు. దీనికి తోడు క్రూరడైన విలన్, బలంవంతుడైన హీరో.. ఇద్దరి మధ్య పోరాటాలు పెట్టి వాటిని ఒక కాజ్ కు అనుసంధానం చేస్తారు. ఇక్కడే ప్రేక్షకుడు కథలో లీనమవుతాడు. దానితో ప్రయాణిస్తాడు. ఈ సూత్రాలను పాటిస్తున్నారు కాబట్టే ఈ ఇద్దరి దర్శకుల సినిమాలు ఇంతవరకు పరాజయం పొందలేదు. పైగా వీరు క్రియేట్ చేసిన యూనివర్స్ ప్రేక్షకులను మరో కొత్త లోకానికి తీసుకెళ్తోంది. అచ్చం జేమ్స్ కామెరున్ అవతార్ లాగా..
Also Read: Nikhil Karthikeya 2: కృష్ణుడు అవతారం చాలించాకా ఏమైంది
అంచలంచెలుగా ఎదిగారు
2014 లో కన్నడలో ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమా తీసే నాటికి అతడికి పెద్దగా అనుభవం కూడా లేదు. ఆ సినిమా పైన పెద్ద హోప్స్ కూడా ఎవరికీ లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత రికార్డులను కొల్లగొట్టింది. హీరో పాత్రను కొత్తగా చూపించిన విధానం కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ విజయం ఇచ్చిన ఊపుతో ప్రశాంత్ నీల్ హోం బలే ఫిలిమ్స్ తో బాండ్ రాసుకున్నాడు. ఈసారి ఏకంగా రెండేళ్లపాటు పూర్తి కథ రచనలోనే మునిగిపోయాడు. అలా పుట్టుకొచ్చిందే కేజిఎఫ్. ఈ సినిమాలో యశ్ ను తీసుకున్నాకే.. మిగతా పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకున్నారంటే నీల్ కథకు ఎలాంటి ప్రాధాన్యమిస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే కేజీఎఫ్ విడుదలైందో అప్పుడు కన్నడ సినిమా స్టామినా బయటి ప్రపంచానికి తెలిసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి ఎంతటి బెంచ్ మార్కో.. శాండల్ ఉడ్ లో కూడా కే జి ఎఫ్ చాప్టర్ 1, 2 అంతటి ట్రేడ్ మార్క్ లు. ఈ ఊపుతో అదే సంస్థతో ప్రభాస్ హీరోగా ప్రస్తుతం నీల్ సలార్ అనే సినిమా తీస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. 2025 వరకు ప్రశాంత్ నీల్ డేట్స్ ఖాళీగా లేవు.
ఇతడు అన్నింటా ప్రత్యేకం
సందీప్ కిషన్ హీరోగా తమిళంలో మా నగరం అనే సినిమా వచ్చింది. అప్పటిదాకా లోకేష్ కనకగరాజ్ అనే డైరెక్టర్ బయట ప్రపంచానికి తెలియదు. నాలుగు భిన్నమైన పాత్రల మధ్య జరిగే ఆ కథ కార్తికి బాగా నచ్చడంతో ఖైదీ సినిమాలో అవకాశం ఇచ్చాడు. 2019లో విడుదలైన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా తర్వాత విజయ్ మాస్టర్ సినిమాకి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా లోకేష్ కనగరాజ్ మరింత రాటు దేలాడు. ఆ తర్వాత కమలహాసన్, విజయ్ సేతుపతి, పహాద్ పజల్ తో విక్రమ్ సినిమా తీశాడు. ఈ సినిమా 350 కోట్ల దాకా కొల్లగొట్టింది. అప్పటిదాకా అప్పుల్లో ఉన్న కమలహాసన్ ఈ సినిమాతో తన అప్పులను మొత్తం తీర్చేశాడు. ఏకంగా లోకేష్ కు కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.
పాత్రలకు ప్రత్యేక పేర్లు
ఈ ఇద్దరు దర్శకులు తమ పాత్రలకు బలమైన పేర్లు పెట్టుకుంటారు. కేజీఎఫ్ లో నారాచీ, శాంతమ్మ, రాఖీ, రమికా సేన్, ఆండ్రూస్, సూర్య వర్ధన్, గరుడ, అదీరా..ఇలా వేటికవే భిన్నం.లోకేష్ కూడా అంతే.. ఖైదీలో హీరో పాత్ర పేరు ఢిల్లీ, మాస్టర్ లో విజయ్ పేరు జేడీ, విక్రమ్ లో కమల్ పేరు చీఫ్, విలన్ పేరు సంతానం..చివర్లో ట్విస్ట్ ఇచ్చే సూర్య పేరు అలెక్స్.. ఇలా వాళ్ళు తీసిన గత సినిమాల పేర్లు, వాటి తాలూకూ కథలకే కొనసాగింపు ఇస్తుండటంతో వీరికి ప్రత్యేక యూనివర్స్ ఏర్పడింది. అన్నట్టు లోకేష్ డేట్లు కూడా 2025 వరకు ఖాళీగా లేవు. ఇప్పుడు వీరు తీస్తున్న సినిమాలు భారీ వసూళ్లు అందుకంటే గనుక వీరు మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళడం ఖాయం.
Also Read:Rao Ramesh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న రావు రమేష్.. కారణం అదే