Lenin Movie First Review: అక్కినేని అఖిల్ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న లెనిన్ సినిమా వచ్చే నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరప్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాను ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకైతే చూపించారట. ఈ సినిమా కథ చాలా ఎగ్జైటింగ్ గా ఉందట. మహాభారతాన్ని బేస్ చేసుకొని ఈ కథనైతే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో అఖిల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో కథ బాగున్నప్పటికి దాని ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేశారు అంటూ కొన్ని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు అఖిల్ సినిమా మీద చాలావరకు నెగెటివ్ ప్రచారం జరుగుతుంది.
కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు ఈ సినిమాను చూసిన తర్వాత ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందించినట్టుగా తెలుస్తుంది. దాంతో ఇండస్ట్రీ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది… ఒక పెద్ద అడ్వెంచర్ ని చేసి ఆ ఊరిలోని కొంతమందిని హీరో ఎలా కాపాడాడు అనేది ఈ సినిమాలో మిళితమై ఉన్న అంశం అని తెలుస్తుంది. ఇక ఇందులో ట్విస్ట్ లు కూడా చాలా వరకు ఎగ్జైట్ చేయబోతున్నాయట.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని చూసిన ఇండస్ట్రీ పెద్దలు చాలా హ్యాపీ గా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు నాగార్జున సైతం ఈ సినిమాను చూసి భారీ సక్సెస్ ను సాధించబోతున్నామంటూ ఒక ట్వీట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ మూవీ ఏదో గట్టిగానే కొట్టబోతుంది అనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ లాంటి హీరో ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. కాబట్టి ఆయనకి ఈ సక్సెస్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇండస్ట్రీ పెద్దల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ చూస్తుంటే ప్రస్తుతం ఆయన కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక వచ్చే నెల 10 వ తేదీ వస్తే గాని ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు…
