Lenin First Week Collections: ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో లాభాల పరంగా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. అతి తక్కువ రేట్లకు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి. ఆ కారణం చేత , ప్రతీ ప్రాంతం లోనూ బయ్యర్స్ పెట్టిన ప్రతీ పైసాకు నాలుగింతల ఎక్కువ వచ్చింది. అంతే కాదు ఫుల్ రన్ ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. అయితే సమంత సినిమా విడుదలైనప్పుడు , అక్కినేని సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ని పోల్చి సోషల్ మీడియా లో ట్రోల్స్ చేయడం సహజం. అలాంటిది ‘మా ఇంటి బంగారం’ విడుదలైన రెండు వారాలకు ‘లెనిన్’ చిత్రం విడుదలైంది. ఇక సోషల్ మీడియా లో రెండు సినిమాలను పిలిచి చూడడం సాధారణమైన విషయమే కదా.
‘లెనిన్’ చిత్రం థియేటర్స్ లో విడుదలై వారం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా , విశ్లేషకులు ‘మా ఇంటి బంగారం’ మొదటి వారం వసూళ్లతో ‘లెనిన్’ వసూళ్లను పోల్చి చూస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా మొదటి వారం 28 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, ‘లెనిన్ ‘ చిత్రానికి వరల్డ్ వైడ్ గా మొదటి వారం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ‘లెనిన్’ చిత్రమే లీడింగ్ లో ఉన్నప్పటికీ , కొన్ని ప్రాంతాల్లో మాత్రం ‘మా ఇంటి బంగారం’ కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది ‘లెనిన్’ చిత్రం. ముఖ్యంగా ఓవర్సీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓవర్సీస్ ప్రాంతం లో ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి మొదటి వారం 8 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
కానీ ‘లెనిన్’ చిత్రానికి కేవలం 3 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అంటే ‘మా ఇంటి బంగారం’ ని 50 శాతం కూడా మ్యాచ్ చేయలేకపోయింది అన్నమాట. రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే పరిస్థితి. ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + తమిళనాడు కలిపి 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ‘లెనిన్’ చిత్రానికి కేవలం రెండు కోట్లు మాత్రమే వచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో భారీ లీడింగ్ తో ఉండడం వల్ల, లాంగ్ రన్ లో కూడా ‘లెనిన్’ చిత్రం ‘మా ఇంటి బంగారం’ వసూళ్లను అందుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
