https://oktelugu.com/

VarunTej – Lavanya : ఆ స్టార్ హీరోతో లిప్ కిస్ కి ప్రయత్నం చేసిన లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ రియాక్షన్ చూస్తే ఆశ్చర్యపోతారు!

విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ ఉంటుందనే భయం తో ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని వదులుకుందట. అందుకు వరుణ్ తేజ్ కూడా కారణం అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ కూడా ఇదే విషయం చెప్పి , కచ్చితంగా అలాంటి సన్నివేశాలు ఉంటాయి,

Written By:
  • NARESH
  • , Updated On : June 20, 2023 / 08:51 PM IST
    Follow us on

    VarunTej – Lavanya : ‘అందాల రాక్షసి’ సినిమాతో వెండితెర కి హీరోయిన్ గా పరిచయమై, ఆ తర్వాత తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ, అతి తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ గా ఎదిగిన నటి లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియా లో ప్రతీ రోజు ట్రెండింగ్ లో ఉండే టాపిక్ గా మారిపోయింది. కారణం ఆమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుండడమే.

    రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకున్న ఈ ఇద్దరు, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇది ఇలా ఉండగా లావణ్య త్రిపాఠి కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే ఒక స్టార్ హీరో లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని ఆ సినిమానే రిజెక్ట్ చేసిందట, ఇంతకీ ఆ హీరో ఎవరు?, సినిమా ఏమిటి అనేది తెలుసుకుందాం.

    విజయ్ దేవరకొండ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమా అప్పట్లోనే సుమారుగా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మండన కి బదులుగా లావణ్య త్రిపాఠి ని అడిగారట. కానీ లావణ్య త్రిపాఠి అప్పటికే అర్జున్ రెడ్డి సినిమా చూసింది.

    ఈ సినిమాలో లాగానే విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ ఉంటుందనే భయం తో ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని వదులుకుందట. అందుకు వరుణ్ తేజ్ కూడా కారణం అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ కూడా ఇదే విషయం చెప్పి , కచ్చితంగా అలాంటి సన్నివేశాలు ఉంటాయి, వద్దు అన్నాడట. ఇక అతను చెప్పిన తర్వాత లావణ్య త్రిపాఠి ఎందుకు వినకుండా ఉంటుంది, వెంటనే రిజెక్ట్ చేసింది, ఫలితంగా కెరీర్ ని మలుపు తిప్పే బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకుంది.