https://oktelugu.com/

Kona Venkat : గంజాయి స్మగ్లింగ్ చేసిన స్టార్ రైటర్ కోనా వెంకట్, దొరికిపోయిన ఫ్రెండ్!

Kona Venkat : స్టార్ రైటర్ కోనా వెంకట్ గంజాయి స్మగ్లింగ్ చేశానని నేరుగా చెప్పడం సంచలనం రేపుతోంది. కాలేజీ రోజుల్లో గంజాయి దందా చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. దానికి వాళ్ళ నాన్న డీఎస్పీ కావడం ఉపయోగపడిందని చెప్పి మరింత షాకింగ్ విషయాలు వెల్లడించారు. గతంలో జరిగిన ఈ విషయాన్ని వివరిస్తూ… చదువుకునే రోజుల్లో నేను గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడ్డాను. నా మిత్రుడు ఒకడు అప్పులపాలయ్యారు. అవి తీర్చేందుకు ఒక సాహసం చేశాడు. గంజాయి పండించి […]

Written By: , Updated On : January 8, 2023 / 07:46 PM IST
Follow us on

Kona Venkat : స్టార్ రైటర్ కోనా వెంకట్ గంజాయి స్మగ్లింగ్ చేశానని నేరుగా చెప్పడం సంచలనం రేపుతోంది. కాలేజీ రోజుల్లో గంజాయి దందా చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. దానికి వాళ్ళ నాన్న డీఎస్పీ కావడం ఉపయోగపడిందని చెప్పి మరింత షాకింగ్ విషయాలు వెల్లడించారు. గతంలో జరిగిన ఈ విషయాన్ని వివరిస్తూ… చదువుకునే రోజుల్లో నేను గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడ్డాను. నా మిత్రుడు ఒకడు అప్పులపాలయ్యారు. అవి తీర్చేందుకు ఒక సాహసం చేశాడు. గంజాయి పండించి అది గోవాలో అమ్మి సొమ్ము చేసుకోవాలి అనుకున్నాడు.

గోవాకు గంజాయి తరలించే క్రమంలో పట్టుబడ్డాడు. దీంతో మొత్తం కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. ఆ విషయం మాకు తెలిసి వాడిని సేవ్ చేయాలని డిసైడ్ అయ్యాము. మిత్రుడు అప్పులు తీర్చాలంటే మళ్ళీ గంజాయి స్మగ్లింగే మార్గం అనుకున్నాము. ఈసారి పకడ్బందీగా గోవాకు గంజాయి తీసుకెళ్లి అమ్ముకోవాలని డిసైడ్ అయ్యాము. పండించిన గంజాయి మెహబూబ్ నగర్, కర్ణాటక, గోవా మూడు బోర్డర్స్ దాటించాము.

మా నాన్న డీఎస్పీ కావడంతో ఆయన కారులో తీసుకెళ్ళాము. దాని వలన పని ఈజీ అయ్యింది. అనుకున్నట్లు గోవాలో గంజాయి అమ్మి… వచ్చిన డబ్బులతో మితృడు అప్పులన్నీ తీర్చేశాం. ఒకవేళ పట్టుబడితే పరిస్థితి ఏంటని ఇప్పటికి కూడా భయమేస్తుందని… కోనా వెంకట్ ఓపెన్ గా తాను చేసిన పెద్ద క్రైమ్ బహిర్గతం చేశాడు. వారి రియల్ స్టోరీని మూవీగా చేయాలని కూడా అనుకున్నాడట. గంజాయి స్మగ్లింగ్ పెద్ద నేరం కాగా… అది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశామని చెప్పి కోనా వెంకట్ సంచలనానికి తెర లేపారు.

ధైర్యంగా చేసిన తప్పు ఒప్పుకున్నప్పటికీ కోనా వెంకట్ వంటి సెలెబ్రిటీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆయన మాటలు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచే ప్రమాదం ఉంది. స్నేహితుల కోసం, అవసరాల కోసం తప్పుడు మార్గాలు అనుసరించవచ్చని చెప్పినట్లుగా ఉన్న నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రాలకు కోనా వెంకట్ రచయితగా పనిచేశారు. ఆయన నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, వెంకీ, అదుర్స్, రెడీ, దూకుడు ఇలా ఆయన లిస్ట్ అనేక హిట్ చిత్రాలు ఉన్నాయి.