
యంగ్ హీరో నితిన్ ‘మహానటి’ కీర్తి సురేష్ వెంటపడుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ‘రంగ్ దే’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. వెంకీ అల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ్ దే’ మూవీ పూర్తయిన తర్వాత నితిన్ బాలీవుడ్ రీమేక్ మూవీ ‘అంధాదున్’లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీలో నితిన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఈ మూవీలో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత నితిన్ మరోసారి కీర్తి సురేష్ తో నటించనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
సాంబమూర్తి చెప్పినవన్నీ అసత్యాలే..!
లాక్డౌన్ కు ముందు నితిన్ తాజా చిత్రం ‘భీష్మ’ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో వరుస మూవీలకు కమిట్ అయ్యారు. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా అంచనాలన్నీ తలకిందలయ్యారు. అంతేకాకుండా నితిన్ పెళ్లి కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక సినిమా షూటింగులు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఈమేరకు నితిన్ తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈమేరకు దర్శకుడు కృష్ణ చైతన్యతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘పవర్ పేట’ టైటిల్ ఖరారైనట్లు సమాచారం. ఇందులో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఈమేరకు కీర్తి సురేష్ ను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కీర్తి సురేష్ ప్రస్తుతం నితిన్ తో కలిసి ‘రంగ్ దే’ మూవీలో నటిస్తుంది. అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘అణ్ణత్త’ మూవీలో నటిస్తుంది. దీంతోపాటు మరో రెండు తమిళ మూవీల్లో నటిస్తుంది. ‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత హీరోయిన్ ఓరియంటేడ్ మూవీలపై దృష్టిసారించింది. కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో ‘మిస్ ఇండియా’ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కింది. అయితే లాక్డౌన్ కారణంగా ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. ‘మహానటి తర్వాత తెలుగులో కీర్తిసురేష్ నటించిన చిత్రం ‘మిస్ ఇండియా’నే కావడం విశేషం. అగ్రహీరోల పక్కన వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ నితిన్ లాంటి యంగ్ హీరోకు కీర్తి సురేష్ మరోసారి ఛాన్సివ్వడం ఆసక్తిని రేపుతోంది.