Journalists Land Grab : కోట్ల విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూమి.. జర్నలిస్టులంతా పంచుకుతిన్నారట..?

Journalists land grab : అది కరీంనగర్ కు కూతవేటు దూరంలోని ఖరీదైన ప్రాంతం. హైదరాబాద్ రోడ్డుకు ఆనుకొని మంచి రియల్ ఎస్టేట్ ఎదుగుదల ఉన్న శివారు భూములవీ. గుంటకే 20 నుంచి 30 లక్షల వరకూ రోడ్ సైడ్ పలుకుతున్న ప్రాంతం. అలాంటి చోట అప్పుడెప్పుడో మానేరు డ్యాం కోసం సేకరించిన ప్రభుత్వ అసైన్డ్ భూములున్నాయి. వాటిపై ప్రభుత్వ నిఘా కరువు అవ్వడంతో ఓ రియల్టర్ మెల్లిగా కొన్ని ఎకరాలు కబ్జా చేశాడట.. అయితే ఈ విషయం […]

Written By: Raghava Rao Gara, Updated On : February 25, 2023 10:56 am
Follow us on

Journalists land grab : అది కరీంనగర్ కు కూతవేటు దూరంలోని ఖరీదైన ప్రాంతం. హైదరాబాద్ రోడ్డుకు ఆనుకొని మంచి రియల్ ఎస్టేట్ ఎదుగుదల ఉన్న శివారు భూములవీ. గుంటకే 20 నుంచి 30 లక్షల వరకూ రోడ్ సైడ్ పలుకుతున్న ప్రాంతం. అలాంటి చోట అప్పుడెప్పుడో మానేరు డ్యాం కోసం సేకరించిన ప్రభుత్వ అసైన్డ్ భూములున్నాయి. వాటిపై ప్రభుత్వ నిఘా కరువు అవ్వడంతో ఓ రియల్టర్ మెల్లిగా కొన్ని ఎకరాలు కబ్జా చేశాడట.. అయితే ఈ విషయం ఊరికే ఉంటుందా? అటూ ఇటూ తిరిగి మెల్లగా ఓ ప్రధాన పత్రిక రిపోర్టర్లకు తెలిసింది. వాళ్లు దీన్ని పేపర్లో పబ్లిష్ చేస్తాం.. పెంటపెంట చేస్తామని బెదిరించారట..

దీంతో దెబ్బకు భయపడిపోయిన రియల్టర్ ఓ ఉపాయం ఆలోచించాడు. ఆ కబ్జా భూమిలోని కొన్ని ప్లాట్లను, ఎకరాలను సదురు రిపోర్టర్ కు వారి బాస్ లకు ఇచ్చేందుకు అంగీకరించాడట.. ఇలా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిపోయింది.

ఆ గ్రామ కొత్త పాసుపుస్తకాల్లో ఈ అసైన్డ్ భూమి కొందరు రిపోర్టర్లు , మీడియా ఇన్ చార్జిల పేరు ఉండడంతో అవాక్కైన కొందరు గ్రామస్థులు ఈ విషయాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఆధారాలతో సహా బయటపెట్టారు. ప్రస్తుతం ఆ ఆధారాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసైన్డ్ భూమి రిపోర్టర్లు, మీడియా ఇన్ చార్జిల పేరిట ఉండడం చూసి అందరూ షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.

అయితే ఈ విషయంలో మరో వాదన కూడా లీకైంది. ఒక మీడియా ఇన్ చార్జికి ఏకంగా ఎకరంపైనే అసైన్డ్ భూమి దాఖలు పడ్డట్టు గ్రామ రికార్డుల్లో నమోదైంది. ఆయనకు పాస్ బుక్ ఇష్యూ సందర్భంగా లిస్ట్ విడుదల చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

అయితే దీనివెనుక పెద్ద కథే నడిచిందని సమాచారం. ప్రభుత్వ అధికారులతో కలిసి ఆ మీడియా ఇన్ చార్జి, రిపోర్టర్లు చాకచక్యంగా పేదలు, దళితులకు అసైన్డ్ భూముల పంపిణీలో లబ్ధి పొందారన్న టాక్ నడుస్తోంది. ఆ మీడియా ఇన్ చార్జి కూడా దళితుడే కావడంతో ఆయన పేరు కూడా పెట్టారని.. అలా ఎకరం విలువ చేసే కోట్ల భూమి ఆయనకు కేటాయించారని ఒక గుసగుస బయటకు వచ్చింది. అయితే సదురు మీడియా జర్నలిస్ట్ ను ఈ విషయంపై కొందరు ప్రశ్నిస్తే తాను ఎకరం పెట్టి ప్రభుత్వ అసైన్డ్ భూమిని కొన్నానని బుకాయించాడట..

మరి ఈ రెండు వాదనల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కానీ.. అసైన్డ్ భూమి అయితే జర్నలిస్టుల పేరు మీద బదిలీ అయ్యింది. కోటికిపైగానే విలువ చేసే ఈ అసైన్డ్ భూమిని జర్నలిస్టులు పంచుకుతిన్నట్టు స్థానిక గ్రామస్థులు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆరోపిస్తున్నారు.