Site icon OkTelugu

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి రియాక్షన్ ఊహించలేదు..

Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం ఎదురుకున్న ఇక్కట్ల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎట్టకేలకు వాటి అన్నిటిని విజయవంతంగా ఎదురుకొని నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఇది టాలీవుడ్ లో బాలయ్య హీరో గా నటించిన భగవంత్ కేసరి కి రీమేక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ మేకర్స్ అలా ప్రమోట్ చేయకుండా , కేవలం సన్నివేశాలను మాత్రమే తీసుకున్నాం అంటూ ప్రచారం చేశారు. కానీ ట్రైలర్ చూస్తే భగవంత్ కేసరి కి జిరాక్స్ కాపీ అనే చెప్పాలి. మరి ఈ తమిళ వెర్షన్ భగవంత్ కేసరి ఆడియన్స్ ని అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ముందుగా ఫస్ట్ హాఫ్ గురించి నెటిజెన్స్ ఏమంటున్నారో ఒకసారి గమనించగా, ఇంటర్వెల్ సన్నివేశం చాలా సాలిడ్ గా ఉంది , కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయి కానీ , డైరెక్టర్ టేకింగ్ మాత్రం అసలు బాగాలేదని, బాబీ డియోల్ ట్రాక్ చాలా చెత్తగా ఉందని అంటున్నారు. అంతే కాకుండా VFX వర్క్ చాలా దారుణంగా ఉందని , సినిమాకు అతి ముఖ్యమైన కూతురు ఎమోషన్ సరిగా పండలేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ , అనిరుద్ మాత్రమే ప్లస్ పాయింట్స్ గా నిలిచారని , వాళ్ళ పనితనం తప్ప , ఫస్ట్ హాఫ్ ఏమి లేదని చెప్పుకొచ్చారు. సెకండ్ హాఫ్ లో కూడా ఇదే పరిస్థితి. కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయి అట , అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కలిసొచ్చింది అట. కానీ ఓవరాల్ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది అట. భగవంత్ కేసరి ని డిట్టో దింపినా బాగుండేది , కానీ డైరెక్టర్ వినోద్ చేసిన మార్పులు చేర్పులు ఈ సినిమా కొంపమించిందని అంటున్నారు.

ఇక విలన్ గా చేసిన బాబీ డియోల్ క్యారెక్టర్ ని చూస్తే నవ్వు వచ్చేలా ఉందని అంటున్నారు నెటిజెన్స్. అంతా వీక్ గా డిజైన్ చేశారట. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అసలు బాగాలేదని , సినిమా స్క్రీన్ ప్లే ఒక ఫ్లో లో వెళ్లకుండా, ఎమోషనల్ సన్నివేశాలు మధ్యలో అతికించినట్టు ఉండడం తో , ఒరిజినల్ వెర్షన్ లో కలిగే ఎమోషనల్ ఫీలింగ్ ఈ సినిమా ని చూస్తున్నంతసేపు పొందలేమని, ఇక క్లైమాక్స్ సన్నివేశం అయితే మన సహనానికి పరీక్ష పెడుతుందని అంటున్నారు. ఓవరాల్ గా విజయ్ ని చివరిసారిగా వెండితెర మీద చూసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకు వెళ్లగలరని , మామూలు ఆడియన్స్ చూడలేరని అంటున్నారు.

Exit mobile version