Trivikram : ఇండస్ట్రీ లో మాటల మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్. దానికి తగ్గట్టు గానే ఆయన రాసిన కథలు,మాటలు మంచి గుర్తింపు ను సంపాదించుకుంటాయి. ఇండస్ట్రీలో ఇంతకుముందు ఉన్న సినిమాలతో సంబంధం లేకుండా ఒక సపరేట్ స్టోరీని గాని, డైలాగ్స్ ని గానీ రాయడంలో తను సిద్ధహస్తుడు. ఆయనను బీట్ చేసే రైటర్ ఇంకా ఇండస్ట్రీ లో పుట్టలేదనే చెప్పాలి.
ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక రీసెంట్ గా మహేష్ బాబు చేసిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో తన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో చేయాలనుకున్నప్పటికీ ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదనే వార్తలైతే వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయకుండా ఎన్టీయార్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయిన తర్వాత, ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నారు.
ఇక ఇప్పుడు కూడా గుంటూరు కారం ప్లాప్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా చేసి సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. అరవింద సమేత తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉన్నప్పటికీ అది అనుకోని పరిస్థితుల వల్ల పోస్ట్ పోన్ అయింది.ఇక ఇప్పుడు ఎన్టీయార్ దేవర సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ప్రశాంత్ నీల్ సినిమాకి కేటాయించిన డేట్స్ ని కంప్లీట్ చేసి త్రివిక్రమ్ సినిమా మీద ఎన్టీఆర్ ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ సినిమాలను ఏకకాలం లో కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇదే క్రమంలో వీళ్ళ కాంబినేషన్ లో మరొక హిట్ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మరి త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాతో ఒక ఇండస్ట్రీ హిట్టు కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…