Deepti Sunayana : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమాని చాలామంది సెలబ్రిటీగా మారుతున్నారు. ఇక అందులో భాగంగానే దీప్తి సునైనా కూడా వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది ఇక దాంతో తను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా బాగా పాపులారిటిని సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ పాపులారిటిని అంతకంతకు పెంచుకుంటూ వచ్చింది.
ఇక ఈ క్రమంలో యూట్యూబ్ లో స్టార్ గా వెలుగుతున్న షణ్ముఖ్ జస్వంత్ తో చాలా సాంగ్స్ లలో సిరీస్ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇలాంటి క్రమంలో జస్వంత్ తో చాలా రోజుల పాటు ప్రేమ వ్యవహారం నడిపింది అంటూ చాలా వార్తలైతే వచ్చాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటూ ఎక్కడ చూసినా కూడా వాళ్ళిద్దరే కనిపిస్తూ ప్రేక్షకులను అలరించేవారు. ఇక అలాగే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వార్తలకి బలాన్ని చేకూరుస్తు చాలాసార్లు సన్నిహిత్యంగా కనిపించారు. ఇక దాంతో సోషల్ మీడియా మొత్తం వీళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలైతే వచ్చాయి.
దాంతో వాళ్ళని ఇష్టపడే అభిమానులు వీళ్ళిద్దరూ ఒకటైతే చూడాలని చాలా ముచ్చట పడ్డారు. ఇక కొద్ది రోజులకి వీళ్లు కలిసి కనిపించడం కానీ కలిసి సిరీస్ లలో నటించడం లేదు దాంతో వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ అయిందనే వార్తలు వచ్చాయి. కానీ దీని మీద వీళ్ళిద్దరూ ఏ రకంగా స్పందించలేదు. అప్పటి నుంచి షణ్ముఖ్ జశ్వంత్ వేరే వాళ్ళతో సిరీస్ లు చేస్తుంటే దీప్తి సునైనా కూడా వేరే వాళ్ళతో సాంగ్స్ సీరీస్ లు చేస్తూ వస్తుంది. ఇక ఇలాంటి సమయంలో ఇప్పుడూ సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది.
అదేంటి అంటే దీప్తి సునైనా ఒక వ్యక్తిని హగ్ చేసుకుని ఉన్న ఫోటోని తను ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది దాంతో దీప్తి సునైనా కి కొత్త లవర్ దొరికాడు ఆయన ఇతనే అంటూ ప్రస్తుతం వాళ్ళిద్దరూ కలిసి ఉన్న పిక్ ని వైరల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు…