https://oktelugu.com/

Lavanya Tripathi : హీరోయిన్ ‘లావణ్య త్రిపాఠి’కి ఇంత డబ్బు పిచ్చి ఉందా? ఆ హీరోకి బ్రేకప్ చెప్పడానికి కారణం అదేనా!

దీనిపై లావణ్య త్రిపాఠి పలుమార్లు స్పందించి మా మధ్య అలాంటిదేమి లేదని చెప్పినప్పటికీ ఈ రూమర్స్ ఆగడం లేదు. అయితే ఈమె గురించి లేటెస్ట్ గా మరో పుకారు షికారు చేస్తుంది. అదేమిటంటే ఈమె వరుణ్ తేజ్ కంటే ముందే అందాల రాక్షసి చిత్ర హీరో నవీన్ చంద్ర తో కొంతకాలం ప్రేమాయణం నడిపిండట.

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2023 / 09:07 PM IST
    Follow us on

    Lavanya Tripathi : టాలీవుడ్ లో అందం తో పాటుగా అభినయం ని సమానంగా పంచగలిగే హీరోయిన్లు ఇప్పుడు దొరకడం చాలా కష్టం. కేవలం ఒకరిద్దరు మినహా , మిగిలిన హీరోయిన్స్ అందరూ అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ వచ్చారు. కానీ అలాంటి హీరోయిన్స్ మధ్య కూడా లావణ్య త్రిపాఠి లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.

    హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ‘అందాల రాక్షసి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకుంది. అయితే ఈమె గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో రూమర్స్ తో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ తో ఈమె ప్రేమాయణం నడుపుతుందని, వీళ్లిద్దరి నిశ్చితార్థం జూన్ నెలలో జరగనుందని అలా పలు రకాల వార్తలు ప్రచారం అయ్యాయి.

    దీనిపై లావణ్య త్రిపాఠి పలుమార్లు స్పందించి మా మధ్య అలాంటిదేమి లేదని చెప్పినప్పటికీ ఈ రూమర్స్ ఆగడం లేదు. అయితే ఈమె గురించి లేటెస్ట్ గా మరో పుకారు షికారు చేస్తుంది. అదేమిటంటే ఈమె వరుణ్ తేజ్ కంటే ముందే అందాల రాక్షసి చిత్ర హీరో నవీన్ చంద్ర తో కొంతకాలం ప్రేమాయణం నడిపిండట.

    వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి, కానీ నవీన్ చంద్ర కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ కాకపోవడం తో ఆమె అతనిని వదిలేసి , కొంతకాలం తర్వాత వరుణ్ తేజ్ ప్రేమలో పడిందని ఒక రూమర్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈమె పెళ్లి చేసుకుంటుందో లేదో తెలియదు కానీ, ఈమె పెళ్లి చేసుకునేలోపు సోషల్ మీడియా లో ఆమెకి పది పెళ్లిళ్లు చేసేట్టు ఉన్నారు గాసిప్ రాయుళ్లు. మరి ఈ లేటెస్ట్ రూమర్ పై లావణ్య త్రిపాఠి స్పందిస్తుందో లేదో చూడాలి.