https://oktelugu.com/

Dhanush Ishwarya divorced: ధనుష్-ఐశ్వర్య విడాకులకు ఆ ఇద్దరు హీరోయిన్లే కారణమా?

ఎప్పుడో జరిగిన సంఘటనకు ఇంత ఆలస్యంగా నిర్ణయమా? Dhanush Ishwarya divorced : చిత్ర పరిశ్రమలో వివాహ బంధాలతో ఇలా ఒక్కటవుతుంటే.. అలా విడిపోతున్నారు. ఎంత వేగంగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారో.. అంతే వేగంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గత కొంతకాలం నుంచి సెలబ్రిటీల సినిమాలు కాకుండా వారి వ్యక్తిగత విషయాలతోనే హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. కొందరు నేరాలు, మోసాలతో వార్తల్లోకి ఎక్కితే.. వారి భాగస్వామితో తెగదెంపులు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరికొందరు. ఇటీవల […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2022 / 09:35 AM IST
    Follow us on

    • ఎప్పుడో జరిగిన సంఘటనకు ఇంత ఆలస్యంగా నిర్ణయమా?

    Dhanush Ishwarya divorced : చిత్ర పరిశ్రమలో వివాహ బంధాలతో ఇలా ఒక్కటవుతుంటే.. అలా విడిపోతున్నారు. ఎంత వేగంగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారో.. అంతే వేగంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గత కొంతకాలం నుంచి సెలబ్రిటీల సినిమాలు కాకుండా వారి వ్యక్తిగత విషయాలతోనే హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. కొందరు నేరాలు, మోసాలతో వార్తల్లోకి ఎక్కితే.. వారి భాగస్వామితో తెగదెంపులు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరికొందరు. ఇటీవల టాలీవుడ్ మోస్ట్‌ క్యూట్‌ కపుల్ నాగ చైతన్య, సమంత విడిపోయారనే విషయాన్ని మరిచిపోక ముందే కోలీవుడ్‌ బ్యూటీఫుల్ కపుల్‌ ధనుష్‌, ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానగణం, ప్రేక్షకలోకం నివ్వెరపోయింది. కారణాలు ఏంటా అని ఆలోచిస్తున్నాయి.

    Dhanush Ishwarya divorced

    స్టార్‌ హీరో ధనుష్‌ పేరు మరోసారి సంచలనమైంది. భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య- ధనుష్‌ 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

    Also Read:  షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయిన ‘పవర్ స్టార్’ సినిమాలు..!

    సుచీ లీక్స్ తో కలహాలు..

    నిజానికి వీరిద్దరి మధ్య సుచీ లీక్స్‌ వ్యవహారంతోనే కలహాలు మొదలయ్యాయని కోలీవుడ్‌ టాక్‌. తమిళనాట స్టార్‌ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్‌ పేరు సుచీ లీక్స్‌లో బయటపడటం అప్పట్లో సంచలనమైంది.

    అసలేంటీ సుచీ లీక్స్‌?
    2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్‌. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.

    ఈ లిస్ట్‌లో స్వయంగా రజనీకాంత్‌ అల్లుడు, అప్పటికే స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకన్న ధనుష్‌ ఉండటం మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. త్రిష, అమలాపాల్‌ వంటి హీరోయిన్లతో ధనుష్‌ ప్రైవేట్‌ ఫోటోలు లీకయ్యాయి. దీనికి తోడు కొందరు హీరోయిన్లతో ధనుష్‌కు ఉన్న ఏఫైర్లను చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఐదేళ్ల కిందటి సంఘటనలు ఇప్పడు ప్రభావం చూపాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇన్ని రోజుల తర్వాత నిర్ణయానికి రావడం అనేది నమ్మేలా కనిపించడం లేదు. విడాకులకు మరేవైనా కారణాలు ఉండచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏదేమైమా మున్ముందు మరన్ని విషయాలు బయటికి రావచ్చు.
    – శెనార్తి

    Also Read: Budget: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యం కోసం ఎంత కేటాయించ‌నున్నారంటే..?