Singer Sunitha: సింగర్ సునీత గాత్రం ఎంతో మధురంగా ఉంటుందని తెలుగు ప్రేక్షకులు అంటుంటారు. అలాగే ఆమె గాత్రం కంటే కూడా ఆమె చీర కట్టు ఇంకా అందంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. ఏది ఏమైనా సునీత రూపురేఖల్లో తెలుగుతనం ఉంటుంది. ఆమె ముఖబింబంలో ఆహ్లాదకరమైన వర్చస్సు ఉంటుంది. ఇక సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆమె రెండో పెళ్లి తర్వాత, ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ట్రెండ్ కి తగ్గట్టు లైఫ్ ను లీడ్ చేస్తోంది. సరదగా పార్టీలలో కూడా పాల్గొంటుంది. అయితే, ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. సునీత ప్రస్తుతం గర్భవతి అని పుకార్లు పుట్టించారు. మరి ఈ పుకార్లలో నిజం ఉందా అని ఆరా తీస్తే.. సునీత మాత్రం మళ్లీ తల్లి కావాలనే ఆలోచనలో ఉందట.
Also Read: ‘రాడ్ రంబోలా’ లకే ‘భంభోల’ లాంటి సినిమా ఇది !
ఈ క్రమంలోనే సరోగసి ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో సునీత క్లారిటీ ఇస్తే గానీ అసలు నిజం తెలియదు. ఇక సునీత రెండో భర్త రామ్ పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్. అందుకే డిజిటల్ లోకి సునీత కూడా ఎంటర్ కానుంది. సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉంది.
అయితే, ఆ చిన్న చిత్రాల నిర్మాణ పరంపరను సునీత నేపథ్యంలో సాగుతుందట. సునీతనే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. సింగర్ గా ఎంతో పాపులారిటీ సాధించిన సునీత, మరి నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సునీతకు బుల్లితెర పై బోలెడు అభిమానులు ఉన్నారు, అందుకే సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తోంది.
Also Read: ఛాన్స్ కోసమే రాశి ఖన్నా ఆతనితో డేటింగ్ ?