https://oktelugu.com/

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జిగా వ్యహరించేది ఆయనే?

Telugu Indian Idol: కొత్త టాలెంట్ ను వెలికితీసే క్రమంలో మొదలైన ఇండియన్ ఐడల్ ఎంత పెద్ద హిట్టు అయిందో అందరికీ తెల్సిందే. సోనీ టెలివిజన్ ఛానల్ ప్రతీయేటా ఇండియన్ ఐడల్ పేరిట కొత్త కొత్త సీజన్లను ప్రారంభిస్తూ నూతన సింగర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. ఇందులో గెలుపొందిన విజేతలకు భారీ క్యాష్ ప్రైజ్ తోపాటు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ కు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 12, 2022 / 05:24 PM IST
    Follow us on

    Telugu Indian Idol: కొత్త టాలెంట్ ను వెలికితీసే క్రమంలో మొదలైన ఇండియన్ ఐడల్ ఎంత పెద్ద హిట్టు అయిందో అందరికీ తెల్సిందే. సోనీ టెలివిజన్ ఛానల్ ప్రతీయేటా ఇండియన్ ఐడల్ పేరిట కొత్త కొత్త సీజన్లను ప్రారంభిస్తూ నూతన సింగర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. ఇందులో గెలుపొందిన విజేతలకు భారీ క్యాష్ ప్రైజ్ తోపాటు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

    Telugu Indian Idol

    ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ కు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ లభిస్తోంది. దీంతో యువ సింగర్స్ ఈ షోలో పాల్గొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఈ షోలోకు పెద్దపెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్ అతిథులుగా వచ్చి యువ సింగర్స్ కు తమ విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అలాగే తమ పాటలతో అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. దీంతో ఈ షోకు సీజన్ సీజన్ కు విపరీతమైన టీఆర్పీ దక్కుతోంది.

    సోనీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడిల్ తరహాలోనే ‘ఆహా’ ఓటీటీ సైతం తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టబోతుంది. ఈ షోకు ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ సన్సేషన్ తమన్ జడ్జిగా వ్యవహరించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వరుస సినిమాలతో బీజీగా ఉన్న తమన్ ఈ  కార్యక్రమానికి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

    మరోవైపు ‘ఆహా’ ఓటీటీ తెలుగు ప్రేక్షకుల కోసం ఇప్పటికే అనేక వెబ్ సిరీసులు, సినిమాలును అందుబాటులో ఉంచింది. ఇతర భాషల్లోని సినిమాలను తెలుగులో డబ్ చేసి మరీ ‘ఆహా’ ఉంచుతున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ ‘ఆహా’లో హోస్ట్ చేస్తున్న అన్ స్టాబుల్ టాక్ షో దేశంలోనే నెంబర్ వన్ షోగా ఇటీవల గుర్తింపు తెచ్చుకుంది. ఇక త్వరలోనే కొత్త సింగర్స్ కూడా ‘ఆహా’ వేదికగా మారనుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.