spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna Vivek Athreya Movie Title: బాలకృష్ణ , వివేక్ ఆత్రేయ మూవీకి విచిత్రమైన టైటిల్.....

Balakrishna Vivek Athreya Movie Title: బాలకృష్ణ , వివేక్ ఆత్రేయ మూవీకి విచిత్రమైన టైటిల్.. అభిమానులు ఎలా తీసుకుంటారో..

Balakrishna Vivek Athreya Movie Title: ‘అఖండ’ నుండి ‘డాకు మహారాజ్’ వరకు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోయిన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్పీడ్ కి ‘అఖండ 2’ బ్రేక్ వేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలోని అనేక సన్నివేశాలు సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ ని గురి కావడంతో ఫలితం తేడా కొట్టేసింది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య స్క్రిప్ట్స్ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గానే ఆయన గోపీచంద్ మలినేని తో ఒక సినిమాని మొదలు పెట్టాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రం తో పాటు, ప్రముఖ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తో కూడా బాలయ్య ఒక సినిమాని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ‘సరిపోదా శనివారం’ చిత్రం తో భారీ హిట్ ని అందుకున్న వివేక్ ఆత్రేయ , కొంత గ్యాప్ తర్వాత బాలయ్య తో మన ముందుకు రాబోతున్నాడు.

Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు

అయితే ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ రెండు భాగాలుగా తెరకేక్కిన్చాలని నిర్ణయించుకున్నాడట. కేవలం ఒక్క సినిమాతో కథని ముగించే స్కోప్ లేకపోవడం వల్లే , ఇలా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తియ్యాలనే ఆలోచన బాలయ్య ముందు పెట్టడం , అందుకు ఆయన కూడా ఆమోదం తెలపడం , నిర్మాత కూడా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సుముఖత చూపించడం వంటివి జరిగాయట. ఈ చిత్రానికి ‘కురుక్షేత్రం’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య సినిమా టైటిల్ అంటే చాలా పవర్ ఫుల్ గా ఉండాలి, కానీ ఈ ‘కురుక్షేత్రం’ టైటిల్ చాలా ఓల్డ్ గా ఉందని, అసలు బాలయ్య రేంజ్ కి తగ్గట్టుగా లేదని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అంటున్నారు.

‘కురుక్షేత్రం’ అని టైటిల్ ని పెట్టారు కాబట్టి, ఈ సినిమా స్టోరీ మహాభారతం నేపథ్యం లో సాగుతుందా?, లేదంటే రెగ్యులర్ స్టోరీనా? అనేది తెలియాల్సి ఉంది. బాలయ్య ప్రస్తుత వయస్సుకి మహాభారతం లోని పాత్రలు పోషిస్తే అసలు బాగుండదు. సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ అవ్వొచ్చు. కాబట్టి ఇది కేవలం సినిమా కథ రీత్యా పెట్టిన టైటిల్ మాత్రమే అని , మహాభారతం తో ఎలాంటి లింక్ లేదని తెలుస్తోంది. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ భారీ బడ్జెట్ తో ‘కురుక్షేత్రం’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలో కృష్ణ అర్జునుడి క్యారెక్టర్ చేయగా, శోభన్ బాబు శ్రీకృష్ణుడి పాత్ర పోషించాడు. ఇక రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ చిత్రం లో కర్ణుడి క్యారెక్టర్ చేసాడు. అప్పట్లో ఈ మల్టీస్టార్రర్ చిత్రాన్ని ఎన్టీఆర్ ‘దాన వీర సూర కర్ణ’ కి పోటీగా విడుదల చేసాడు. ఫలితం డిజాస్టర్. ఇప్పుడే అదే టైటిల్ తో బాలయ్య సినిమా చేయబోతున్నాడు , , మరి ఎలాంటి ఫలితం రాబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular