Hrithik Roshan Sons Dance: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమా మొత్తాన్ని నడిపించే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో ఒకరు హృతిక్ రోషన్(Hrithik Roshan). బాలీవుడ్ లో హాలీవుడ్ ఫీచర్స్ తో ఉన్న నటుడు ఈయన. డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్ ఇలా ప్రతీ అంశం లోనూ హృతిక్ రోషన్ ఎలైట్ క్లబ్ కి చెందిన నటుడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా డ్యాన్స్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ ఇండియా లోనే నెంబర్ 1 అని అనొచ్చు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, పునీత్ రాజ్ కుమార్ వంటి వారు అద్భుతంగా డ్యాన్స్ వేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ హృతిక్ రోషన్ డ్యాన్స్ వేస్తే, ఆయన శరీరం లోని ప్రతీ అంగుళం డ్యాన్స్ వేస్తుంది. అంత స్టైల్ గా ఎవ్వరూ చెయ్యలేరు.
అయితే ఆయన కొడుకులకు సంబంధించిన లేటెస్ట్ డ్యాన్స్ వీడియో ఒకటి చూస్తే, అబ్బో తండ్రినే మించిపోయారు కదా, ఆ రక్తం అలాంటిదిలే అని అనిపించక తప్పదు. హృతిక్ రోషన్ కి హ్రిదాన్ రోషన్, హ్రీహాన్ రోషన్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లిద్దరు అందం లో మాత్రమే కాదు, డ్యాన్స్ లో కూడా హృతిక్ రోషన్ ని డామినేట్ చేస్తున్నారు. వీరిలో ఎవరు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతారో తెలియదు కానీ, కచ్చితంగా సక్సెస్ అవ్వగలరు అని మాత్రం చెప్పొచ్చు. హ్రిదాన్ రోషన్ కి 17 ఏళ్ళు. అచ్చు గుద్దినట్టు ఇతను నాన్న పోలికలతో ఉంటాడు. పలు ఈవెంట్స్ లో కూడా ఈ కుర్రాడు తళుక్కుమని మెరిశాడు. ఇక హ్రీహాన్ రోషన్ కి 19 ఏళ్ళు. ఇతను కూడా చూసేందుకు హాలీవుడ్ హీరో లాగానే ఉన్నాడు. వీళ్లిద్దరు తన తండ్రితో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో ని ఈ ఆర్టికల్ చివర్లో అందిస్తున్నాం చూడండి.
ఇక హృతిక్ రోషన్ సినిమాల విషయానికి వస్తే, ఫైటర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, ఆ హీరో గా నటించిన ‘వార్ 2’ చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ లో ఈ చిత్రం పూర్తిగా డిజాస్టర్ అవ్వగా, హిందీ వెర్షన్ లో మాత్రం హృతిక్ రోషన్ కారణంగా కొంత డీసెంట్ వసూళ్లు అయితే వచ్చాయి. కానీ స్పై యూనివర్స్ అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమా అదే కావడం విశేషం . ప్రస్తుతం ఆయన క్రిష్ 4 చిత్రం లో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా. అదే విధంగా KGF మేకర్స్ హోమబుల్ సంస్థ తో మూడు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటికి దర్శకులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
