ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా పాత్ర పోషించాలి. ఎన్నో సిద్ధాంతాలతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అదే లక్ష్యంతో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక ఆ ఫలితాలు అందరికీ తెలిసిందే. ఆ ఫలితాల తర్వాత కొద్ది రోజుల పాటు రాష్ట్రాన్ని అంటిపెట్టుకుని ఉన్న జనసేనాని.. ఆ తర్వాత హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కరోనా టైంలోనూ పెద్దగా స్పందించలేదు. ఇటీవల వరదలు వచ్చినా రాష్ట్రానికి చేరుకోలేదు. అటు పంటలూ మునిగిపోయాయి.
Also Read: బ్రేకింగ్: 6 గంటలకు ప్రజల ముందుకు మోడీ.. ఏం చెప్తారు?
మరోవైపు మరికొద్ది రోజుల్లో పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌ల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ షూటింగ్ తాజా షెడ్యూల్ మొదలు పెట్టుకోవాలని, తాను కచ్చితంగా హాజరవుతానని భరోసా ఇచ్చారు పవన్. దీంతో నిర్మాత దిల్ రాజు చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చాతుర్మాస దీక్ష పూర్తవుతున్న సందర్భంలో పవన్ తొలిసారి సినిమా షూటింగ్‌లోనే అడుగు పెట్టబోతున్నారు.
అయితే.. రాజకీయ పార్టీ పెట్టి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉన్నా పవన్ కల్యాణ్ కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రానికి రాకపోయినా.. కనీసం హైదరాబాద్‌లోని ప్రజలనైనా పరామర్శించవచ్చు. కానీ.. జనాల్లోకి ఆయన ఎందుకు వెళ్లడం లేదో తెలియకుండా ఉంది. పోనీ పవన్ అన్నింటికీ దూరంగా ఉన్నారంటే అదీలేదు. సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. లాక్‌డౌన్ కాలంలోనే పవన్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపో మాపో షూటింగ్‌కు సై అంటున్నారు. సినిమాలంటే అంత ఉత్సాహం ఉన్న పవన్‌కు, రాజకీయాలంటే పెద్దగా నచ్చడం లేదా అని అందరిలోనూ ప్రశ్న వస్తోంది.
Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే ఉల్లిపాయలు..?
కాపు రిజర్వేషన్లపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసిన పవన్.. అసలు తనకు సినిమాలు ఇష్టమా, రాజకీయాలు ఇష్టమా అనే విషయంపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు. షూటింగ్‌లకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న జనసేనాని, జనంలోకి రావడానికి ఎందుకు జంకుతున్నారు? పవన్ ఫస్ట్ ప్రయారిటీ సినిమాలేనా? ప్రజలకు చెప్పకపోయినా కనీసం జనసైనికులకైనా చెబితే.. వారికి ఓ క్లారిటీ వస్తుంది కదా. ఇలా రెండు పడవల విధానాన్ని పాటిస్తే.. అటు ప్రజల్లోనూ పార్టీకి మైలేజీ పోక తప్పదు.