Heroine Divorce :హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్నతో విడిపోయారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ప్రసన్నకు దూరంగా స్నేహ ఇద్దరు పిల్లలతో వేరే ఇంట్లో మకాం పెట్టారట. గత కొద్దిరోజులుగా పరిశ్రమలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అంటున్నారు. స్నేహ-ప్రసన్న విడాకులకు సిద్దమయ్యారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్ నటుడు ప్రసన్నను స్నేహ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2009లో విడుదలైన ‘అచ్చాముండు అచ్చాముండు’ మూవీలో స్నేహ, ప్రసన్న కలిసి నటించారు. ఈ సినిమా సెట్స్ లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ తరచూ కలిసి షికార్లు కొట్టారు.

స్నేహ-ప్రసన్న మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలను ప్రసన్న ఖండించారు. అనూహ్యంగా 2011 లో ప్రసన్న-స్నేహ తమ రిలేషన్ ప్రకటించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. 2012లో ప్రసన్న-స్నేహ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పదేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నడూ గొడవపడ్డ దాఖలాలు లేవు. కోలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.
స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె స్టార్ హీరోల చిత్రాల్లో వదిన, అక్క వంటి పాత్రలు చేస్తున్నారు. మరోవైపు ప్రసన్న నటుడిగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విబేధాలు ఎందుకు తలెత్తాయనే ప్రశ్న తలెత్తుతుంది.విడాకుల వార్తలపై స్నేహ, ప్రసన్న ఎలాంటి కామెంట్స్ స్పందించలేదు. మౌనం అర్థం అంగీకారం వీరు విడిపోయిన మాట వాస్తవమే అంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి. నిజంగా స్నేహ-ప్రసన్న మధ్య ఏం జరుగుతుందనేది తెలియాలంటే వారు నోరు విప్పాలి.
తెలుగు ఫ్యామిలీకి చెందిన స్నేహ ముంబైలో పెరిగారు. 2000లో విడుదలైన ‘ప్రియమైన నీకు’ స్నేహకు తెలుగులో మొదటి చిత్రం. తరుణ్ హీరోగా తెరకెక్కిన ప్రియమైన నీకు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందం, క్యూట్ యాక్టింగ్ తో స్నేహ యూత్ కి దగ్గరయ్యారు. అప్పట్లో స్నేహకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి వంటి హిట్ చిత్రాల్లో స్నేహ నటించారు. బాలకృష్ణకు జంటగా మహారథిలో నటించారు. తెలుగులో స్నేహ కనిపించిన చివరి చిత్రం వినయ విధేయ రామ. రామ్ చరణ్ వదినగా చేశారు.