Hero Sharwanand : ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్న హీరో శర్వానంద్.. అమ్మాయి డీటెయిల్స్ ఇవే!

Hero Sharwanand : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో శర్వానంద్ ఒకడు.ఈయనకు పెళ్ళీడు వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. 38 ఏళ్ల శర్వానంద్ ఎప్పుడు వివాహం చేసుకుంటారనే ప్రశ్న చాలా కాలంగా పరిశ్రమలో ఉంది. ఇటీవల శర్వానంద్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. అడివి శేష్ తో పాటు ఆయన గెస్ట్ సీట్ పంచుకున్నాడు. బాలయ్య పెళ్లి ఎప్పుడని అగ్గా… ప్రభాస్ పెళ్ళైన వెంటనే నా పెళ్లి అంటూ అస్పష్టమైన సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. అయితే […]

Written By: NARESH, Updated On : January 5, 2023 10:05 am
Follow us on

Hero Sharwanand : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో శర్వానంద్ ఒకడు.ఈయనకు పెళ్ళీడు వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. 38 ఏళ్ల శర్వానంద్ ఎప్పుడు వివాహం చేసుకుంటారనే ప్రశ్న చాలా కాలంగా పరిశ్రమలో ఉంది. ఇటీవల శర్వానంద్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. అడివి శేష్ తో పాటు ఆయన గెస్ట్ సీట్ పంచుకున్నాడు. బాలయ్య పెళ్లి ఎప్పుడని అగ్గా… ప్రభాస్ పెళ్ళైన వెంటనే నా పెళ్లి అంటూ అస్పష్టమైన సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. అయితే ఫైనల్ గా ఆయన వివాహానికి సిద్ధం అయ్యారన్న వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అమ్మాయి సెలక్షన్ కూడా ముగిసిన నేపథ్యంలో ఈ ఏడాది పెళ్లి భాజా మోగడం ఖాయం అంటున్నారు.

 

ఇక శర్వాకు కాబోయే అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అట. ఆమె అమెరికాలో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అలాగే వీరిద్దరి కమ్యూనిటీస్ కూడా వేరని సమాచారం. అమ్మాయి రెడ్డి క్యాస్ట్ కి చెందినవారట. ఇక శర్వానంద్ కమ్మ అని సమాచారం ఉంది. ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారట. ఈ క్రమంలో హైదరాబాద్ లోనే ఉంటున్నారట. శర్వానంద్ తో వివాహం అనంతరం ఆమె ఇండియాలోనే ఉండిపోతారని వినికిడి.

కాగా శర్వానంద్ ఫాదర్ బిజినెస్ మాన్. ఫైనాన్సియల్ గా ఉన్నతమైన కుటుంబంలో శర్వానంద్ పుట్టాడు. హైదరాబాద్ నగరంలో వీరికి పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయని సమాచారం. నటనపై మక్కువతో శర్వానంద్ పరిశ్రమకు వచ్చాడు. హీరో రామ్ చరణ్ శర్వానంద్ కి బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరూ క్లాస్ మేట్స్ అని సమాచారం. ఇటీవల న్యూ ఇయర్ వేడుకలు శర్వానంద్ చిరంజీవి, చరణ్ లతో కలిసి జరుపుకున్నారు.

ఇక కెరీర్ బిగినింగ్ లో శర్వానంద్ చిన్నా చితకా రోల్స్ చేశాడు. యువసేన మూవీతో హీరో అయ్యాడు. శర్వానంద్ కి ప్రయోగాత్మక చిత్రాలు పేరు తెచ్చాయి. గమ్యం, ప్రస్థానం చిత్రాల్లో శర్వానంద్ మంచి నటన కనబరిచాడు. రన్ రాజా రన్ మూవీతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. మహానుభావుడు, శతమానం భవతి చిత్రాలు శర్వానంద్ కి చెప్పుకోదగ్గ విజయాలు అందించాయి. అయితే కొన్నాళ్లుగా ఆయన సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. లాస్ట్ రిలీజ్ ఒకే ఒక జీవితం పర్లేదు అనిపించింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.