https://oktelugu.com/

Sharvanand : శర్వానంద్ పెళ్లి ఆగిపోయిందా..? ఇదెక్కడి ట్విస్ట్ సామీ!

Sharvanand : సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలకు ఏది నిజమైన న్యూస్ ఏది అబద్దమైన న్యూస్ అనేది క్లారిటీ లేకుండా పోయింది.ఎవరికీ తోచినట్టు వాళ్ళు రాసేస్తున్నారు.జరిగింది ఒకటైతే వేరే విధంగా జరిగినట్టు మార్చి రాసి గందరగోళం సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి .గతం లో కొంతమంది సీనియర్ యాక్టర్స్ దీనిపై ప్రెస్ మీట్ పెట్టిమరీ ఖండించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ అన్నీ రూమర్స్ అని అనుకోవడానికి కూడా లేదు,ఎందుకంటే అలా సోషల్ మీడియా లో వచ్చిన […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2023 / 09:56 PM IST
    Follow us on

    Sharvanand : సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలకు ఏది నిజమైన న్యూస్ ఏది అబద్దమైన న్యూస్ అనేది క్లారిటీ లేకుండా పోయింది.ఎవరికీ తోచినట్టు వాళ్ళు రాసేస్తున్నారు.జరిగింది ఒకటైతే వేరే విధంగా జరిగినట్టు మార్చి రాసి గందరగోళం సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి .గతం లో కొంతమంది సీనియర్ యాక్టర్స్ దీనిపై ప్రెస్ మీట్ పెట్టిమరీ ఖండించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

    కానీ అన్నీ రూమర్స్ అని అనుకోవడానికి కూడా లేదు,ఎందుకంటే అలా సోషల్ మీడియా లో వచ్చిన వార్తలు నిజమైనవి కూడా చాలానే ఉన్నాయి.ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన శర్వానంద్ ఇటీవలే హైదరాబాద్ కి చెందిన రక్షిత శెట్టి తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే వీళ్లిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయ్యినట్టు సోషల్ మీడియా లో గత కొద్దిరోజుల నుండి ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది.

    దీనితో శర్వానంద్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..అదేంటి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అనుకున్నాం కదా, ఇలా జరిగిందేంటి అని బాధపడ్డారు.ఈ విషయం శర్వానంద్ సన్నిహిత వర్గాలకు తెలియడంతో వెంటనే వాళ్ళు స్పందించారు.శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ కాలేదని, కేవలం కొన్ని కారణాల వల్ల వాయిదా మాత్రమే పడిందని, త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని తెలిపారు.సోషల్ మీడియా లో వచ్చే అసత్య వార్తలు నమ్మొద్దు అని, ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేసే యూట్యూబ్ చానెల్స్ పై త్వరలోనే కఠినమైన చర్యలు తీసుకుంటాము అంటూ చెప్పుకొచ్చారు.

    ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఆయనని గత ఏడాది విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ సినిమా సక్సెస్ స్ట్రీక్ లోకి తీసుకొచ్చింది.ప్రస్తుతానికి ఆయన సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాడట.పెళ్లి తర్వాత మరో అద్భుతమైన స్క్రిప్ట్ తో మన ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.