https://oktelugu.com/

Munugodu Exitpolls : మునుగోడులో ఆ పార్టీదే విజయం

munugodu Exitpolls ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. మధ్యలో కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. అయితే క్యూలో భారీగా ఓటర్లు బారులు తీరి ఉండడంతో వారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. కాగా అన్ని టాప్ న్యూస్ చానెల్స్, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. మునుగోడులో గెలుపు ఎవరిదన్నది బయటపెట్టాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2022 / 06:26 PM IST
    Follow us on

    munugodu Exitpolls ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. మధ్యలో కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. అయితే క్యూలో భారీగా ఓటర్లు బారులు తీరి ఉండడంతో వారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. కాగా అన్ని టాప్ న్యూస్ చానెల్స్, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. మునుగోడులో గెలుపు ఎవరిదన్నది బయటపెట్టాయి. అందరూ ఊహించిన దానికి భిన్నంగా మునుగోడులో ఫలితం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

     

    మునుగోడు ఉప ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తుతున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లో ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరుమాత్రమే ఉందని తేలుతోంది. బీజేపీ మూడో స్థానంలోకి పడిపోయిందని సమాచారం. రాజగోపాల్ రెడ్డిపై వ్యతిరేకత కారణంగానే ఆయనకు తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎంత డబ్బులు, మద్యం,బంగారం పంచినా కూడా ప్రజలు తీసుకొని తెలంగాణ అధికార పార్టీకే పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తున్నాయి.

    ఈ ఎగ్జిట్ పోల్స్ లో

    టీఆర్ఎస్ కు 38.24 శాతం ఓట్లు
    -కాంగ్రెస్ కు 34.33 శాతం ఓట్లు
    -బీజేపీకి 17.32 శాతం ఓట్లు
    -బీఎస్పీకి 3.59 శాతం ఓట్లు
    – ఇతరులకు 6.53 శాతం ఓట్లు

    వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఓట్లు వస్తాయని నిగ్గుతేల్చారు. మెజార్టీ సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీకే కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటోంది. ఈ రెండు పార్టీల మధ్య స్వల్పంగా 2 నుంచి 4 శాతం ఓట్లలోపే ఉండడం విశేషం. దీన్ని బట్టి మునుగోడులో పోరు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే అని అర్థమవుతోంది. బీజేపీ మూడోస్థానానికి పడిపోవడం ఖాయమంటున్నారు.

    ఇక రాజగోపాల్ రెడ్డిపై వ్యతిరేకత కారణంగా మునుగోడులో బీజేపీ ఓడిపోతోందని రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అభిప్రాయపడుతున్నారు. లేదంటే బీజేపీకి సరైన అభ్యర్థి ఉంటే ఇక్కడ గెలిచేదని అంటున్నారు. చూడాలి మరీ ఈ ఎగ్జిట్ పోల్స్.. ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో నిజం అవుతాయా? లేవా? అన్నది వేచిచూడాలి.