https://oktelugu.com/

Emmanuel Varsha : ప్రేమ పెళ్ళికి వేదికైన జబర్దస్త్… వర్ష మెడలో తాళి కట్టిన ఇమ్మానియేల్!

Emmanuel Varsha : జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియల్ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతడు తోటి లేడీ కమెడియన్ వర్ష మెడలో తాళికట్టాడు. ఈ పరిణామం ఒక్క క్షణం అందరినీ స్తంభింప చేసింది. దాదాపు రెండేళ్లుగా వర్ష-ఇమ్మానియేల్ ప్రేమికులుగా చలామణి అవుతున్నారు. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న పుకారు ఉంది. ముఖ్యంగా వర్ష ఇమ్మానియేల్ పై తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఇమ్మానియేల్ అంటే ఇష్టమని వర్ష చెప్పారు. ఇమ్మానియేల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2022 / 11:04 AM IST
    Follow us on

    Emmanuel Varsha : జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియల్ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతడు తోటి లేడీ కమెడియన్ వర్ష మెడలో తాళికట్టాడు. ఈ పరిణామం ఒక్క క్షణం అందరినీ స్తంభింప చేసింది. దాదాపు రెండేళ్లుగా వర్ష-ఇమ్మానియేల్ ప్రేమికులుగా చలామణి అవుతున్నారు. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న పుకారు ఉంది. ముఖ్యంగా వర్ష ఇమ్మానియేల్ పై తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఇమ్మానియేల్ అంటే ఇష్టమని వర్ష చెప్పారు. ఇమ్మానియేల్ నా అదృష్టంగా భావిస్తాను. అతడు వేరే అమ్మాయికి దగ్గరయ్యాడని తెలిసినా నేను అతన్ని వదులుకోను.. అని వర్ష ఒకసారి చెప్పారు.

    మరో సందర్భంలో నువ్వంటే ఇష్టం. మీ ఇంటికి కోడలిగా వస్తున్నాను. వెళ్లి అత్తమ్మకు చెప్పు అని వర్ష ఇమ్మానియేల్ ని ఉద్దేశించి మాట్లాడారు. వర్ష గతంలో ఇమ్మానియేల్ గురించి మాట్లాడిన వీడియోలు బయటకు తీసి బ్రతుకు బస్టాండ్ పేరుతో ఒక స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో భార్య భర్తలుగా వర్ష, ఇమ్మానియేల్ నటించారు. స్కిట్ ముగిశాక వర్ష నువ్వు నిజంగా ప్రేమించుకుంటున్నారా? అని ఇమ్మానియేల్ ని జడ్జిగా ఉన్న పోసాని అడిగారు. ఏమో అది వర్ష చెప్పాలి సార్ అని ఇమ్మానియేల్ అన్నాడు. ఆమె ప్రేమిస్తుందో లేదో నాకు అనవసరం, నీ నిజాయితీ నాకు నచ్చిందని పోసాని అన్నారు. వర్ష ఓకే అంటే ఇప్పటికిప్పుడు ఆమె మెడలో తాళికడతా అని ఇమ్మానియేల్ అన్నాడు.

    ఇమ్మానియల్ అలా అనడంతో అందరూ షాక్ అయ్యారు. అతన్ని పరీక్షించాలని గెటప్ శ్రీను రంగంలోకి దిగాడు. తాళిబొట్టు తీసుకొని స్టేజ్ పైకి వచ్చాడు. ఇమ్మానియేల్ చేతికి ఇచ్చి కట్టమన్నాడు. ఇమ్మానియేల్ వర్ష మెడలో తాళి కట్టాడు. ఈ పరిణామానికి అందరూ స్టన్ అయ్యారు. ట్విస్ట్ ఏమిటంటే వర్ష ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. నవ్వుతూ తాళి కట్టించుకుంది. ఈ క్రమంలో ఇది నిజమైన పెళ్లేనా లేక హైప్ కోసం ఇలా చేశారా? అనే సందేహాలు మొదలయ్యాయి.

    అది తెలియాలంటే ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి. గతంలో వర్ష-ఇమ్మానియల్ కి ఉత్తుత్తి పెళ్లి చేశారు. పెళ్లి పందిరి వేసి పట్టుబట్టలో ఇద్దరినీ సిద్ధం చేసి వివాహం చేశారు. అది ఎంటర్టైన్మెంట్ లో భాగంగా చేయడం జరిగింది. మరోవైపు తాళిని మరీ ఎగతాళి చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. టీఆర్పీ కోసం పెళ్లి అనే పవిత్ర కార్యాన్ని ఇలా అవహేళన చేయడమేంటని సాంప్రదాయవాదులు పెదవి విరుస్తున్నారు. సినిమా అనేది కల్పన అని తెలుసు కాబట్టి అంగీకరించవచ్చు. రియాలిటీ షోలలో ఒక అమ్మాయి అబ్బాయికి డమ్మీ పెళ్లి చేయడం దారుణం అంటున్నారు.