https://oktelugu.com/

Munugodu By-Poll BSP : భయపెడుతున్న బీఎస్పీ.. టీఆర్‌ఎస్, బీజేపీలో టెన్షన్‌!

Tension in TRS and BJP for BSP in Munugodu! : మునుగోడు ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలో నిలిపిన బీఎస్పీ కౌంటింగ్‌లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలను భయపెడుతోంది. తొలి రౌండ్‌ నుంచి ఓట్లను చీలుస్తోంది. దీంతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో ఉత్కంఠ పెంచుతోంది. 5 రౌండ్ల వరకూ ఇద్దరి మధ్య స్వల్ప మెజారిటీ ఉండడం.. అంతేస్థాయిలో ఓట్లు బీఎస్పీ అభ్యర్థికి పోలవుతుండడంతో ఇద్దరిలోనూ ఆందోళన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2022 / 11:17 AM IST
    Follow us on

    Tension in TRS and BJP for BSP in Munugodu! : మునుగోడు ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలో నిలిపిన బీఎస్పీ కౌంటింగ్‌లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలను భయపెడుతోంది. తొలి రౌండ్‌ నుంచి ఓట్లను చీలుస్తోంది. దీంతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో ఉత్కంఠ పెంచుతోంది. 5 రౌండ్ల వరకూ ఇద్దరి మధ్య స్వల్ప మెజారిటీ ఉండడం.. అంతేస్థాయిలో ఓట్లు బీఎస్పీ అభ్యర్థికి పోలవుతుండడంతో ఇద్దరిలోనూ ఆందోళన నెలకొంది.

    బీసీ మంత్రం ఫలిస్తుందా…
    మునుగోడు ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో నిలిపాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి కూసుకుంట్లల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతిరెడ్డి బరిలో నిలిచారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మునుగోడులో పోటీ చేయాలని నిర్ణయించారు. అయిత్యే ప్రధాన పార్టీల్లా కాకుండా.. బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలిపారు.

    బీసీ ఓటర్లే అధికం..
    మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ ఓటర్లే ఉన్నారు. సుమారు 2.50 లక్షల మంది ఓటర్లు ఉండగా, దాదాపు 80 వేల మంది బీసీ ఓటర్లు ఉన్నారు. దీంతో బీసీ అభ్యర్థికే టికెట్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నుంచి డిమాండ్‌ వచ్చింది. ఆ పార్టీ నేతలే అధిష్టానానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. కానీ సీఎం కేసీఆర్‌ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కూసుకుంట్లకే టికెట్‌ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ కూడా రెడ్డి సామాజిక వర్గాల అభ్యర్థులే బరిలో ఉన్నారు. దీంత బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రధాన పార్టీలకు భిన్నంగా బీసీ సామాజికవర్గానికి చెందిన శంకరాచారిని బరిలో నిలిపారు.

    గెలవకపోయినా మెజారిటీ ఓట్ల కోసమే..
    బీఎస్పీ మునుగోడులో గెలవదని ఆ పార్టీకి తెలుసు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లపైనే ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. వీలైనన్ని ఎక్కువ ఓట్లు సాధించడమే లక్ష్యంగా అభ్యర్థి ఎంపికలోనూ బీసీకే టికెట్‌ ఇచ్చింది. మెజారిటీ ఓట్లు సాధించాలని ఆశించింది. ఈమేరకు ప్రధాన పార్టీలకు దీటుగా ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఈ సభకు కూడా భారీగా జనాలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల ఓట్లు చీలుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుకున్నట్లుగానే కౌటింగ్‌లో కొంత వరకు ఓట్లు సాధించడం గమనార్హం. దీంతో నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య సాగుతున్న కౌటింగ్‌లో ఫలితంపై బీఎస్పీ ప్రభావం కూడా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.